గుడ్డు వాసను మాయం చేసే సింపుల్ చిట్కాలు…
గుడ్డు పగిలి క్రిందపడినప్పుడు, లేదా పాత్రలకు అట్టుకొన్నప్పుడు వెంటనే శుభ్రం చేయకపోతే, కెమిక్ గ్యాస్ హైడ్రోజన్ ఉత్పత్తై బ్యాక్టీరియా చేరి దుర్వాసన మరింత ఎక్కువగా వస్తుంటుంది. కాబట్టి, గుడ్డు వల్ల వచ్చే దుర్వాసను తొలగించడానికి కొన్ని సులభమైన మార్గాలున్నాయి... 1. నిమ్మరసం: నిమ్మరసంతో గుడ్డు వాసను దూరం చేయవచ్చు. గుడ్డ పడ్డ మరకల మీద కొద్దిగా నిమ్మరసం చిలకరించండి. రెండు మూడు నిముషాలు అలాగే ఉంచి తర్వాత పొడి వస్త్రంతో తుడిచేయాలి. ఇలా చేస్తే తక్షణం వాసన పోతుంది. 2. రోజ్ వాటర్: గుడ్డు పడ్డ చోట బాగా ఎండిపోయి, మొండి మరకలుగా తయారైతే రోజ్ వాటర్ తో శుభ్రం చేయడం ఒక సులభమైన పద్దతి. అంతే కాదు, రోజ్ వాటర్ తో శుభ్రం చేసిన తర్వాత ఒక మంచి సువాసన వస్తుంటుంది. 3. వెనిగర్: ఎగ్ స్మెల్ నిర్మూలించడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ ఒక ఎఫెక్టివ్ మార్గం. అందుకు మీరు చేయాల్సిందల్లా, వెనిగర్ లో కాటన్ క్లాత్ ను డిప్ చేసి, మరకపడ్డ ప్రదేశంలో రుద్దాలి. ఇలా రెండు మూడు సార్లు చేస్తే దుర్వాసన మాయం అవుతుంది. 4.ఆరెంజ్ తొక్క: ఎగ్ స్మెల్ తొలగించడానికి ఆరెంజ్ ఒక ఉత్తమమైన మార్గం. ఇది ఒక స్ట్రాంగ్ అండ్ పవర్ ఫుల్ సువాసన అందించే బెస్ట్ హోంరెమడీ. ఆరెంజ్ తొక్కతో ఎగ్ మరకలున్న చోట రుద్ది శుభ్రం చేయాలి.