విండో గ్రిల్స్ నీట్ గా క్లీన్ గా ఉంచే కొన్ని సింపుల్ టిప్స్…
1. బ్రషింగ్ : విండో గ్రిల్స్ కు పట్టిన దుమ్ము మరియు ధూళి తొలగించడానికి ఒక మృదువైన bristle బ్రష్ తీసుకోవాలి. అందుకు మీరు డస్టర్ లేదా మృదువైన వస్త్రం ఉపయోగించవచ్చు. నీళ్ళతో కడగడం లేదా తుడవడానికి ముందు దుమ్ము, ధూళిని తొలగించడం చాలా ముఖ్యం. 2. తుడవడం: విండో గ్రిల్స్ కు డస్ట్ ను తొలగించడానికి బ్రషింగ్ చేసిన తర్వాత, నాణ్యమైన సోపును లేదా సోప్ వాటర్ ను గ్రిల్స్ కు రాయాలి. తర్వాత మెత్తటి కాటన్ క్లాత్ ను ఉపయోగించి శుభ్రంగా తుడవాలి. వాటి మీద ఎటువంటి గీతలు పడకుండా తుడవాలి. దుమ్ము ధూళి చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్లైతే సబ్బులను ఉపయోగించవచ్చు. 3. వాటర్ అండ్ వెనిగర్: గ్రిల్స్ అంతగా మురికి పట్టకుండా ఉంటే అందుకు వెనిగర్ మరియు నీళ్ళను ఉపయోగించి తుడవచ్చు. విండో గ్రిల్స్ శుభ్రం చేయడానికి వెనిగర్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. 4. చేతి తొడుగులు: విండో గ్రిల్స్ శుభ్రం చేసే ముందు చేతులకు కాటన్ హాడ్ సాక్స్ లను తొడుగులను తొడుగుకోవాలి. దాంతో మీరు శుభ్రం చేయాడానికి సులభం అవుతుంది. 5. వేడి నీళ్ళు: విండో గ్రిల్స్ నుండి డస్ట్ మరియు ఏదైన అంటుకొన్న పదార్థాలను తొలగించడానికి వేడి నీళ్ళు చాలా ప్రభావంతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా మీ వంటగది విండోను శుభ్రం చేయాడానికి ఈ పద్దతి బాగా సహాయపడుతుంది. కాటన్ క్లాత్ ను వేడినీటిలో ముంచి తర్వాత విండో గ్రిల్స్ ను తుడవాలి. 6. రసాయనాలు ఉపయోగించకూడదు: విండోకు పట్టిన దుమ్ము,ధూళి తొగించడానికి ఎటువంటి కఠినమైన రసాయనాలను ఉపయోగించకూడదు. ముఖ్యంగా ఐరన్ విండ్ గ్రిల్స్ ను రసాయనాలను ఉపయోగించకూడదు. లేదంటే అవి తుప్పు పట్టడానికి దారితీస్తుంది. కాబట్టి అందుకు తేలికపాటి డిటర్జెంట్స్ ను ఉపయోగించండి.