స్ధిత ఊర్ధ్వపాదవిస్తృతాసనం చేయు విధానము మరియు ఉపయోగాలు…
స్ధిత ఊర్ధ్వపాదవిస్తృతాసనం: - కూర్చొని కాళ్ళను సగం చాపి మడమలు నేలకు ఆనించాలి. - చేతులతో బొటనవేళ్ళను పట్టుకోవాలి. - చేతుల సాయంతో కాళ్ళను నేలకు కొంచెం పై భాగానికి తీసుకురావాలి. - పిరుదులు భాగం మాత్రమే నేలమీద ఉండాలి. - సుదీర్ఘ శ్వాస తీసుకుంటూ కాళ్ళను వెడల్పు చేసి చేతులు, కాళ్ళు నిటారుగా ఉంచి చేయాలి. - ఉండగలిగినంత సేపు ఉండి పూర్వపుస్ధితికి రావాలి.(3 లేదా 5 సార్లు) ఉపయోగం: 1. కాళ్ళు, తొడలు, చేతులు, జబ్బలు, భుజాలు, కండరాలు, ఎముకలు పుష్టివంతంగా తయారవుతాయి. 2. వెన్నెముక చివరిభాగం బలోపేతమై మూలాధారచక్రం సక్రమమగును. 3. సయాటికా, పక్షవాతం లాంటి వ్యాధులు రాకుండా ఉపయోగపడుతుంది. 4. మూలశంక వ్యాధి తొలగును జననేంద్రియ సమస్యలు నివారించుకోవచ్చు. 5. ఋతుక్రమము సక్రమమగును.