పైనాపిల్ రైస్ – సౌత్ ఇండియన్ రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం…
కావలసిన పదార్థాలు: రైస్: 2cups పైనాపిల్ ముక్కలు: 1cup అల్లం: కొద్దిగా(సన్నగా తరిగిపెట్టుకోవాలి) జీడిపప్పు: 8-10 కిస్‌మిస్: 5-6 కారం: 2tsp ఉప్పు: రుచికి తగినంత ఉల్లికాడల తరుగు: 2tbsp రిఫైన్డ్ ఆయిల్: సరిపడా పండుమిర్చి తరుగు: 1tsp వెల్లుల్లి తరుగు: 1/2cup బీన్స్ తరుగు: 1/2cup పసుపు: చిటికెడు మిరియాల పొడి: 1tsp నిమ్మరసం : 1tsp తయారు చేయు విధానం: 1. బియ్యంలో నీళ్లు పోసి పలుకుగా ఉడికించాలి. చల్లారిన తర్వాత కొద్దిగా నూనె వేసి, అన్నం ఆరబెట్టాలి. 2. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి, పోపుకు తగినంత నూనె వేసి, వేడి చేయాలి. 3. ఇప్పుడు అందులో వెల్లుల్లి తరుగు, పండుమిర్చి తరుగు, బీన్స్, క్యారట్ తరుగు వేసి కలపాలి. పోపుగింజలు, ఉప్పు, కూరగాయ ముక్కలు, కారం, అన్నం, పసుపు, పైనాపిల్ ముక్కలు వేసి బాగా కలిపి, ప్లేట్‌లోకి తీసుకోవాలి. 4. చివరగా వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్, ఉల్లికాడలతో, కొద్దిగా పెప్పర్ పౌడర్, నిమ్మరసంతో గార్నిష్ చేసి, సర్వ్ చేయాలి. అంతే పైనాపిల్ ఫ్రైడ్ రైస్ రెడీ.