ఆలూ చిక్కుడు కాయ ఫ్రై ఎలా తయారుచేయాలో చూద్దాం… Let's see how tayaruceyalo Fry potato pod

ఆలూ చిక్కుడు కాయ ఫ్రై ఎలా తయారుచేయాలో చూద్దాం…
 కావల్సిన పదార్థాలు: ఆలు: 5-6 (పొట్టు తీసి, శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకోవాలి) చిక్కుడు కాయలు: 1/2kg(మద్యకు కట్ చేసి పెట్టుకోవాలి) పచ్చిమిర్చి: 2(తరిగినవి) ఉల్లిపాయ: 1(సన్నగా తరిగిపెట్టుకోవాలి) పసుపు: 1tsp మెంతిపొడి: చిటికెడు కారం: 1tsp ధనియాల పొడి: ½tsp జీలకర్ర: 1tsp కరివేపాకు: రెండు రెమ్మలు వెల్లుల్లి రెబ్బలు: 4 ఉప్పు: రుచికి సరిపడా ఆయిల్: 1tbsp తయారుచేయు విధానం: 1. ముందుగా ఫ్రైయింగ్ పాన్‌లో కొద్దిగా నూనె వేసి, అందులో జీలకర్ర వేసి ఒక నిముషం వేగించుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి మరియు కరివేపాకు వేసి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి. 2. తర్వాత అందులోనే కట్ చేసి పెట్టుకొన్నబంగాళదుంప ముక్కలు వేసి, మీడయం మంట మీద 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి. 3. తర్వాత అందులో కట్ చేసిన చిక్కుడు కాయ వేసి, మిక్స్ చేస్తూ మరో 3నిముషాలు ఫ్రై చేసుకోవాలి. అలాగే అందులో ఉప్పు, పసుపు, మెంతిపొడి మరియు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేయించాలి.  4. తర్వాత మంట పూర్తిగా తగ్గించి 6-10నిముషాలు ఫ్రై చేసుకోవాలి. పాన్‌కు మూత పెట్టి ఉడికించుకోవాలి. మద్య మద్యలో కలియబెడుతుండాలి.  5. ఆలూ ఉడికే లోపు, చిక్కుడు కాయ కూడా మెత్తబడుతాయి. తర్వాత అందులో కారం, ధనియాల పొడి కూడా వేసి, అన్నింటిని మిక్స్ చేసి, స్టౌ ఆఫ్ చేసుకోవాలి. అంతే డ్రై అండ్ క్రిస్పీ ఆలూ అండ్ బోర్డ్ బీన్స్ ఫ్రై రెడీ.