స్పినాచ్ గార్లిక్ రైస్‌ను ఎలా తయారుచేయాలో చూద్దాం… Let's see how tayaruceyalo Garlic Spinach Rice

స్పినాచ్ గార్లిక్ రైస్‌ను ఎలా తయారుచేయాలో చూద్దాం…
 కావల్సిన పదార్థాలు: సన్నగా తరిగిన పాలకూర: 4cups అన్నం: 2cups జీలకర్ర: 1tsp ఉల్లిపాయ తరుగు: 1cup వెల్లుల్లి రెబ్బలు: 15 టమోటో తరుగు: 1/2cup అల్లం, వెల్లుల్లి పేస్ట్: 2tsp పచ్చిమిర్చి పేస్ట్: రుచికి తగినంత ఉప్పు: రుచికి తగినంత నూనె: 2tbsp తయారుచేయు విధానం: 1. ముందుగా పాలకూర తరుగును శుభ్రంగా కడిగి, మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గుజ్జులా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. 2. తర్వాత పాన్‌లో నూనె వేడి చేసి అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి. 3. తర్వాత టమోటో తరుగు, అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి. 4. 5నిముషాలు ఈ మొత్తం మిశ్రమాన్ని వేగించుకొన్నాక ముందుగా తయారుచేసి పెట్టుకొన్న పాలకూర గుజ్జు, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి. 5. పాలకూరలో పచ్చివాసన పోయేదాక వేయించి, ఆపై అన్నం కూడా వేసుకుని కలిపి సన్నని మంటపై వేయించాలి. అన్నం బాగా వేడయ్యాక దింపేస్తే చాలు.