సోయా చీజ్ కబాబ్ ఎలా తయారుచేయాలో చూద్దాం…
కావల్సిన పదార్థాలు: బట్టర్ - 50 gms సోయా చుంక్స్ - 250 gms చీజ్ తురుము- 180 gms యాలకలపొడి - 1/4 tsp వైట్ పెప్పర్ పౌడర్ - 1/2 tsp కార్న్ ఫ్లోర్- 10 gms ఫ్రెష్ మిల్క్ క్రీమ్ - 150 ml అల్లం-వెల్లుల్లిపేస్ట్ - 1 tsp రోస్ట్ చేసిన ఉల్లిపాయలు - 100 gms కొత్తిమీర- 10 gms పచ్చిమిర్చి - 4 క్యాప్సికమ్ - 1 ఉప్పు-రుచికి సరిపడా తయారుచేయు విధానం: 1. ముందుగా సోయా చుంక్స్ నీళ్ళలో వేసి ఉడికించుకొని నీరు వంపేసుకోవాలి. 2. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, వైట్ పెప్పర్ పౌడర్, యాలకలపొడి మరియు ఉప్పు ఒక బౌల్లో వేసి బాగా మిక్స్ చేయాలి. 3. తర్వాత అందులోనే ఉడికించిన సోయా చుంక్స్ ను కూడా వేయాలి. 4. వీటిని పక్కన పెట్టి 15నిముషాలు మ్యారినేట్ అవ్వనివ్వాలి. 5. తర్వాత ఒక బౌల్లో చీజ్ తీసుకొని చేత్తో బాగా మిక్స్ చేయాలి. అలా చేయడం వల్ల ఉండలు కట్టకుండా ఉంటుంది. 6. తర్వాత అందులో ఫ్రెష్ మిల్క్, కార్న్ ఫ్లోర్ మరియు ఉప్పు, చీజ్ మిశ్రమాన్ని వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలగలుపుకోవాలి. 7. మొత్తం మిశ్రమంలో ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. 8. తర్వాత కొత్తిమీర, రోస్ట్ చేసిన ఉల్లిపాయలు మరియు పచ్చిమిర్చిని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. 9. ఈ పేస్ట్ ను చీజ్ మిశ్రమంలో వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి. సోయా చుంక్స్ కు బాగా పట్టేలా కోట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 10. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమం నుండి కొద్దిగా పక్కకు తీసి పెట్టి అందులో కొద్దికొద్దిగా తీసుకొని కబాబ్ లా వత్తుకోవాలి. 11. స్టౌ మీద ప్రైయింగ్ పాన్ పెట్టి అందులో ఒక టీస్పూన్ బటర్ వేసి కబాబ్స్ ను ప్లేస్ చేసి అన్ని వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి. 12. ఫ్రై చేసుకొన్న తర్వాత సర్వింగ్ ప్లేట్ లోనికి తీసుకొని వేడి వేడిగా సర్వ్ చేయాలి. సర్వ్ చేసే ముందు ఫ్రైడ్ ఉల్లిపాయలు మరియు క్యాప్సికమ్ తో గార్నిష్ చేయాలి.