కందిపప్పు రైస్(తూర్ దాల్ రైస్) రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం..
కావల్సిన పదార్థాలు: రైస్: 1cup కందిపప్పు: 1/4cup జీలకర్ర: 1tsp ఆవాలు: 1tsp పసుపు: 1/2tsp కరివేపాకు: రెండు రెమ్మలు ఇంగువ: చిటికెడు ఉప్పు: రుచికి సరిపడా ఉల్లిపాయ: 1tbsp పచ్చిమిర్చి: 2 (సన్నగా తరిగి పెట్టుకోవాలి) టమోటో: 1(సన్నగా తరిగిపెట్టుకోవాలి) నూనె: 1tbsp నీళ్ళు : 1/2cup తయారుచేయు విధానం: 1. ముందుగా కుక్కర్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి, వేడిఅయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు వేసి వేగనివ్వాలి. 2. ఒక నిముషం తర్వాత అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, టమోటో వేసి మీడియం మంట మీద మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. 3. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత అందులో పసుపు, ఇంగువ మరియు రుచికి సరిపడా ఉప్పు వేసి ఫ్రై చేయాలి. 4. ఇప్పుడు అందులో శుభ్రంగా కడిగి పెట్టుకొన్న బియ్యం, మరియు కందిపప్పు వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేస్తూ, ఫ్రై చేసుకోవాలి. 5. ఒక రెండు మూడు నిముషాల తర్వాత అందులో సరిపడా నీళ్ళు పోసి, మూత పెట్టి, నాగులు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకొని, స్టౌ ఆఫ్ చేయాలి. అంతే కందిపప్పు రైస్ రిసిపి రెడీ.