కార్న్ టమోటో బాత్ ఎలా తయారుచేయాలో చూద్దాం…
కావల్సిన పదార్థాలు: వైట్ రైస్ - 400 gms స్వీట్ కార్న్ - 1 cup టమోటో గుజ్జు- 1 cup ఉల్లిపాయ - 1 పచ్చిమిర్చి - 2 వెల్లుల్లి రెబ్బలు - 6 pods (సన్నగా తరిగినవి) కొత్తిమీర - కొద్దిగా గరం మసాలా - ½ tsp పసుపు - 1/4th tsp ఆవాలు - ½ tsp శెనగపప్పు - 1 tsp కరివేపాకు - 10 రెబ్బలు ఉప్పు: రుచికి సరిపడా తయారుచేయు విధానం: 1. ముందుగా పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక అందులో ఆవాలు, నువ్వులు, శెనగపప్పు, ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేసుకోవాలి. 2. తర్వాత అందులోనే పచ్చిమిర్చి మరియు కరివేపాకు కూడా వేసి వేగించుకోవాలి. 3. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత అందులో టమోటో గుజ్జు వేసి మరో రెండు నిముషాలు ఫ్రై చేసుకోవాలి. 4. తర్వాత అందులో ఉప్పు, గరం మసాలా, పసుపు మరియు స్వీట్ కార్న్ వేసి మీడియం మంట మీద 5 నిముషాలు ఉడికించుకోవాలి. 5. ఈ గ్రేవీకి ముందుగా వండిపెట్టుకొన్న అన్నం జోడించి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి. 6. మొత్తం మిశ్రమం కలగలుపుకొని తక్కువ మంట మీద మరో 5 నిముషాలు ఫ్రై చేసుకోవాలి. 7. అంతే కార్న్ టమోటో రైస్ రిసిపి రెడీ. కొత్తిమీర తరుగు, ఉల్లిపాయ ముక్కలను గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.