ఆరోగ్యకరమైన హెల్తీ దిల్ హెర్బల్ రైస్ రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం…
కావల్సిన పదార్ధాలు: దిల్ హెర్బ్ - 2 cups రైస్ - 1 cup అల్లం - 10g వెల్లుల్లి - 4 to 5 pieces జీలకర్ర - 1/4th teaspoon పసుపు - 1/4th teaspoon పచ్చిమిర్చి - 4 to 5 ఉల్లిపాయలు - 1 cup కొబ్బరి - 1/2 cup కొత్తిమీర - 4 to 5 ఆవాలు - 1/4th teaspoon ఉప్పు: రుచికి తగినంత నూనె: సరిపడా తయారుచేయు విధానం: 1. ముందుగా కుక్కర్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేసి తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, పసుపు మరియు కారం వేసి ఒక నిముషం వేగించుకోవాలి. 2. పోపు వేగేలోపు మిక్సీ జార్‌లో కొబ్బరి, పచ్చిమిర్చి, అల్లం, మరియు వెల్లుల్లి వేసి అవసరం అయితే కొద్దిగా నీళ్ళు జోడించి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. 3. ఇప్పుడు పోపు వేగుతున్న కుక్కర్లో దిల్ హెర్బ్ మరియు మిక్సీలో గ్రైండ్ చేసుకొన్న పేస్ట్ వేసి మొత్తం మిశ్రమం మిక్స్ చేయాలి. 4. అలాగే ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకొన్న కప్పు బియ్యం కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత అందులో సరిపడా నీళ్ళు పోసి మిక్స్ చేయాలి. 5. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టాలి. విజిల్ పెట్టాలి. 6. మొత్తం మిశ్రమం ఉడికి రెండు మూడు విజిల్స్ వచ్చే వరకూ ఉండి తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. అంతే దిల్ రైస్ రెడీ. వేడి వేడిగా సర్వ్ చేయాలి.