వాటర్‌మెలోన్ మరియు స్ట్రాబెర్రీ స్మూతీ ఎలా తయారుచేయాలో చూద్దాం…
కావల్సిన పదార్థాలు: స్ట్రాబెర్రీస్ - 1 cup వాటర్‌మెలోన్ - 2 cup యాలకలు - 2 to 3 పెప్పర్ - చిటికెడు షుగర్ - 1/2 cup ఐస్ - 1/2 cup తయారుచేయు విధానం: 1. ముందుగా వాటర్‌మెలోన్ మరియు స్ట్రాబెర్రీలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత వాటిలో విత్తనాలు తొలగించాలి. 2. తర్వాత ఈ ఫ్రూట్స్ ముక్కలను మిక్సీ జార్లో వేసి ఒక కప్పు వాటర్ వేసి గ్రైండ్ చేయాలి. 3. తర్వాత ఈ స్మూతీని ఒక బౌల్లోకి తీసుకోవాలి. కొద్దిసేపు బయట అలాగే ఉంచాలి. 4. కొద్దిసేపటి తర్వాత తిరిగి ఈ స్మూతిని మిక్సీ జార్లో వేసి, స్మూతీతో పాటు, ఐస్ క్యూబ్స్, యాలకలు, మరియు పంచదార వేసి మరో సారి గ్రైండ్ చేయాలి. 5. తర్వాత ఈ స్మూతీని సర్వింగ్ గ్లాసులోకి మార్చుకొని చిటికెడు పెప్పర్ పౌడర్‌ను చిలకరించి, కూల్ కూల్‌గా సర్వ్ చేయడమే.