చిరాకు తెప్పించే బొద్దింకలు మరియు చీమలు నిర్మూలించడం ఎలా ? How to eliminate cockroaches and ants are annoying ?

చిరాకు తెప్పించే బొద్దింకలు మరియు చీమలు నిర్మూలించడం ఎలా ?
- మిరియాలు: మిరియాల పొడి, ఉల్లిపాయల పేస్ట్, వెల్లుల్లి అన్నింటిని కలిపి నీళ్లు కలిపి పేస్ట్ చేయాలి. దీన్ని అక్కడక్కడ చల్లడం వల్ల బొద్దింకలు ఆ వాసనకు మాయమవుతాయి.  - ఎండిపోయిన నిమ్మతొక్కలు: ఎండబెట్టిన నిమ్మ డిప్పలను వార్డ్‌ రోబ్‌ల్లో వేసుకుంటే పురుగులు బొద్దింకలు, చీమల బెడద ఉండదు.  - బొరాక్స్ పౌడర్: బొరాక్స్ పౌడర్ లో కొద్దిగా పంచదార కలిపి చల్లితే చీమలు, బొద్దింకలు ఇంట్లో తిరగకుండా మాయమవుతాయి.  - బేకింగ్ సోడా: బేకింగ్ సోడా, చక్కెర కలిపి బొద్దింకలు తిరిగే ప్రదేశంలో చల్లాలి. దీనివల్ల కచ్చితంగా బొద్దింకలు కనిపించకుండా పోతాయి.  - బిర్యానీ ఆకు:బొద్దింకలు తిరిగే ప్రదేశంలో బిర్యానీ ఆకులను పౌడర్ చేసి చల్లడం వల్ల ఆ వాసనకే అవి చచ్చిపోతాయి.