తలస్నానానికి ముందు తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?Jagrattalenti take a shower before ?

తలస్నానానికి ముందు తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?
ఆయిల్ మసాజ్: తలస్నానానికి ముందు గోరువెచ్చని నూనెతో మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేయడం వల్ల జుట్టు మెరుస్తూ, ఆరోగ్యంగా ఉంటుంది. వేడి నీటిని: తలస్నానానికి ఎప్పుడూ ఎక్కువ వేడి నీటిని ఉపయోగించరాదు. హాట్ వాటర్ వల్ల జుట్టు పొడిబారడమే కాకుండా రఫ్‌గా మారిపోతుంది.  తేనె, పెరుగు: జుట్టు శుభ్రం చేసుకోవడానికి ముందు తేనె, పెరుగు కలిపి జుట్టుకి పెట్టుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. తేనె మాయిశ్చరైజింగ్‌లా పనిచేసి కండిషనర్ లుక్ ఇస్తుంది. మినప్పప్పు: మూడు టేబుల్ స్పూన్ల మినుములను రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే మెత్తటి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఇందులో ఒక ఎగ్, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి, ఒక కప్పు పెరుగు మిక్స్ చేయాలి. బాగా కలిపి జుట్టుకి పట్టించి అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.