బియ్యంలో పురుగు చేరకుండా ఉండటానికి ఈజీ టిప్స్…
- వేపాకులతో: బియ్యం నిల్వ చేయడానికి ఎక్కువ మంది వేపాకులనే వాడుతుంటారు. ఎందుకంటే వేపాకులో ఉండే క్రిమి సంహారక లక్షణం వల్ల బియ్యంలో పురుగులు పడకుండా ఉంటాయి. అందుకోసం ముందుగా కొన్ని వేపాకులను తీసుకొని బాగా ఎండబెట్టుకొని మొత్తని పొడిగా చేసుకోవాలి. దీన్ని లైనింగ్ క్లాత్ వంటి కాటన్ వస్త్రంలో చిన్న చిన్న మూటలుగా కట్టి బియ్యం మధ్యలో పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల బియ్యంలో తెల్లపురుగులతో పాటు, ముక్క పురుగులు కూడా చేరకుండా ఉంటాయి. - ఇంగువ: వంటకాల్లో విరివిగా ఉపయోగించే ఇంగువ కూడా బియ్యంలో పురుగులు చేరకుండా కాపాడుతుంది. దీనికి కారణం ఇంగువ వెదజల్లే ఘాటైన వాసనే. దీన్ని కొద్దిగా తీసుకొని బియ్యంలో కలిపితే సరిపోతుంది. దీని నుంచి వెలువడే ఘాటైన వాసన వల్ల బియ్యంలో పురుగులతో పాటు, తేమ వల్ల పెరిగే బ్యాక్టీరియాను సైతం సంహరిస్తుంది. ఇవే కాదు..బిర్యానీ ఆకులను ఉపయోగించినా కూడా మంచి ఫలితం కనిపిస్తుంది. - కర్పూరంతో: కర్పూరం వాడితే పరుగులు పడవా అన్న సందేహం కలగవచ్చు? కర్పూరం వెదజల్లే ఘాటైన సువాసన వల్ల బియ్యంలో పురుగులు పడవు. ఈ ఫలితాన్ని పొందడానికి పది కర్పూరం బిళ్లలను తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. దీన్ని కాస్త మందంగా ఉండే కాటన్ వస్త్రంలో చుట్టి, బియ్యం డబ్బాలో పెడితే సరిపోతుంది.