దుస్తుల మీద పడ్డ ఎల్లో కర్రీ మరకలను తొలగించే సులభ చిట్కాలు…
దుస్తుల మీద పడ్డ కర్రీ మరకలు పసుపుగా మారిన మొండి మరకలు మరియు వాసనను తొలగించాలంటే, దుస్తుల మీద కర్రీ పడిన వెంటనే రన్నింగ్ వాటర్ లో ముందుగా కడిగేయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటిలో దుస్తులను నానబెట్టుట వల్ల సాప్ట్ గా మార్చుతుంది. వెనిగర్: ఎల్లో కర్రీ మరకలను తొలగించడానికి వైట్ వెనిగర్ ను ఉపయోగించాలి. అందుకు మీరు చేయాల్సిందల్లా ఒక టేబుల్ స్పూన్ లిక్విడ్ డిష్ వాషింగ్ డిటర్జెంట్ ను, ఒక టేబుల్ స్పూన్ వైట్ వెనిగర్ తో మిక్స్ చేసి రెండు కప్పులు చల్లటి నీటిలో వేసి బాగా మిక్స్ చేసి తర్వాత ఈ నీటితో ఎల్లో మరకమీద వేసి రుద్దాలి. ఇలా మరకపోయే వరకూ రుద్దుతుంటే మంచి ఫలితం ఉంటుంది. నిమ్మరసం:కాటన్ దుస్తుల మీద పడ్డ ఎల్లో కర్రీ మరకలను తొలగించడానికి నిమ్మరసం బాగా పనిచేస్తుంది. మెండి మరకల మీద నిమ్మరసం పిండి, ఒక చుక్క వెనిగర్ వేసి బాగా రుద్ది వాష్ చేస్తే శుభ్రంగా తొలగిపోతుంది. ఈ రెండింటి కాంబినేషన్ ఒక నాణ్యమైన నేచురల్ బ్లీచ్ గా పనిచేస్తాయి.