ఫ్రీజర్ ను శుభ్రపరచడానికి సులభ చిట్కాలు…
ఫ్రిజ్ ను శుభ్రం చేయాలనుకున్నప్పుడు ముందుగా అందులో ఉన్న పదార్ధాలన్నీ తీసి బయటపెట్టాలి. ఫ్రిజ్ లోపల కొంత తడి లేదా ఐస్ గడ్డకట్టి ఉంటుంది. కాబట్టి, క్లీన్ చేయడానికి ముందు ఫ్రీజర్ యొక్క ప్లగ్ స్విచ్ ఆఫ్ చేసి, ప్లగ్ పక్కన తీసి పెట్టి, కొద్ది సమయం అలాగే ఉండాలి ఫ్రిజ్ లోపల ఐస్ వదులవుతుంది. హెయిర్ డ్రయ్యర్: డీఫ్రాస్టింగ్ ప్రొసెస్ త్వరగా చేయాంటే, హెయిర్ డ్రయ్యర్ తో ఫ్రిజ్ లోపల తడి పూర్తిగా తొలగించాలి. ఫ్రీజర్ లోప హెయిర్ డ్రయ్యర్ తో ఐస్ ను కరిగించవచ్చు. దాంతో ప్రీజర్ ను సులభంగా శుభ్రం చేయవచ్చు. ఫ్రీజర్ ను తుడవాలి: డీఫ్రాస్ట్ చేసిన తర్వాత ఒక శుభ్రమైన కాటన్ క్లాత్ తీసుకొని, పైనా, క్రింద బాగంలో క్లీన్ గా తుడవాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా తుడవాలి. ఫ్రీజర్ తడి ఆరనివ్వాలి: ఫ్రీజర్ ను శుభ్రం చేయడానికి మరో నేచురల్ క్లీనింగ్ పరిష్కారం, ఫ్రీజర్ మొత్తం శుభ్రం చేసిన తర్వాత అందులో వెంటనే పదార్థాలన్నింటిని నిల్వ చేయకుండా ఫ్రీజర్ డోర్ ను తెరచి పెట్టి పూర్తిగా తడి ఆరిపోనివ్వాలి. ప్రీజర్ లో మంచి సువాసన కోసం: చాలా మందికి ప్రీజర్ నుండి మంచి సువాసన వస్తే చాలా ఇష్టం. అటువంటి వారు, కొద్దిగా నిమ్మరసంతో ఫ్రిజ్ ను తుడవాలి. బేకింగ్ సోడా:సన్నని రంద్రాలున్న చిన్న డబ్బాలో బేకింగ్ సోడాను నింపి ఫ్రిజ్ లో ఒక మూలలో పెట్టడం వల్ల చెడువాసనలు స్ర్పెడ్ కాకుండా ఉంటాయి. తిరిగి పనిచేసేలా : క్లీనింగ్ ప్రొసెస్ పూర్తి అయిన తర్వాత, మీ ఆహార పదార్థాలు తిరిగి నిల్వ చేసుకోవచ్చు. ఫ్రీజర్ లో మొత్త నింపేయకూడదు. అది లోపల గాలి ఇతర పదార్థాకలు సోకకుండా అడ్డుకుంటుంది. కాబట్టి, ఆహార పదార్థాల మద్య కొంచెం స్థలం ఉండేలా చూసుకోవాలి.