టైల్స్ పై సిలిండర్ త్రుప్పు మరకలను పోగొట్టే సులభ చిట్కాలు…
నిమ్మరసం: ఇంట్లో ఎటువంటి మొండి మరకలైనా సరే నిమ్మరసం ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది. వంటగదిలో సిలిండర్ పెట్టిన చోట త్రుప్పు మరకలను తొలగించడానికి కొద్దిగా నిమ్మరసం చిలకరించి పది నిముషాలు అలాగే ఉంచి తర్వాత టూత్ బ్రష్ ఉపయోగించి శుభ్రం చేస్తే చాలా స్మూత్ గా త్రుప్పు మరకలు మాయం అవుతాయి. కిరోసిన్: ప్లోర్ టైల్ మీద ఏర్పడిన రస్ట్ స్టైన్స్ వదలించడానికి కిరోసిన్ ఒక బెస్ట్ హోం రెమెడీ. ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. సిలిండర్ త్రుప్పు పడ్డ మరకల మీద కొద్దిగా కిరోసిన్ చిలకరించి 10 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. బ్లీచ్: క్లీనింగ్ పదార్థాల్లో బ్లీచ్ ఒక వండర్ ఫుల్ క్లీనింగ్ ఏజెంట్ . సిలిండర్ త్రుప్పు మరకలను వదిలించడానికి కొద్దిగా బ్లీచ్ ను చిలకరించి 15నిముషాల తర్వాత నీటితో బాగా రుద్ది కడగడం వల్ల క్లీన్ గా మరియు మెరిసేటి వంటగది టైల్స్ ను మీరు గమనించవచ్చు.