రాగి పాత్రలను తళతళ మెరిపించే సులభ చిట్కాలు…
1. వెనిగర్ మరియు సాల్ట్: కాపర్ వెజల్స్ ను శుభ్రం చేయడానికి వెనిగర్ చాలా బాగా సహాయపడుతుంది . కాపర్ పాత్రల మీద కొద్దిగా వెనిగర్ ఉప్పు చిలకరించి బాగా రుద్ది, తర్వాత మంచినీళ్ళతో శుభ్రం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 2. నిమ్మరసం : నిమ్మతొక్క తీసుకొని కాపర్ వస్తువుల మీద బాగా రుద్దాలి. తర్వాత మంచి నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల రాగి వస్తువులు కొత్తవాటిలా మెరుస్తుంటాయి. 3. బేకింగ్ సోడ: బేకింగ్ సోడా చలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది . కాపర్ వస్తువులను శుభ్రం చేయడానికి దీన్ని ఎప్పుడూ టాప్ లిస్ట్ లో ఎంపిక చేసుకోవాలి . మీరు నిమ్మరసం బేకింగ్ సోడా కాంబినేష్ ఎంపిక చేసుకోవచ్చు. లేదా నేరుగా బేకింగ్ సోడాను మాత్రమే ఎంపిక చేసుకొని రాగి వస్తువులను శుభ్రం చేయాలి.