ఇంట్లో ఉండే ప్లాస్టిక్ వస్తువులు శుభ్రం చేయడానికి చిట్కాలు…
ప్లాస్టిక్ వస్తువులను శుభ్రం చేయాలనుకొన్నప్పుడు ముందుగా చల్లటి నీటితో కడిగేయాలి. తర్వాత ఒక టబ్ నీటిలో 10నిముషాలు నానబెట్టాలి. ఆ సమయంలో పాతవాసనలు తొలగిపోతాయి. న్యూస్ పేపర్తో : కొత్తప్లాస్టిక్ వస్తువులను కొనుగోలు చేసినప్పుడు వాటి నుండి కొత్తగా ప్లాస్టిక్ వాసన వస్తుంటే, న్యూస్ పేపర్ తీసుకొని బాగా ఉండచుట్టి ప్లాస్టివస్తువుల్లో స్టఫ్ చేసి పెట్టాలి. ఇది ప్లాస్టిక్ వాసన తొలగించడానికి బాగా సహాయపడుతుంది. తర్వాత మరుసటి రోజు వేడి నీటితో శుభ్రం చేసుకోవాలి. నిమ్మరసంతో : ప్లాస్టిక్ వస్తువులను శుభ్రం చేయడానికి మరో ఉత్తమ మార్గం నిమ్మరసం. నిమ్మతొక్కతో ప్లాస్టిక్ వస్తువులను రుద్ది కడగడం వల్ల ప్లాస్టిక్ వాసన మరియు ఇతర ఆహార పదార్థాల యొక్క వాసన తొలగిపోవడంతో పాటు మరకలు కూడా తొలగిపోతాయి. కాఫీగింజలతో : ప్లాస్టిక్ వస్తువులకు ఏదైనా అంటుకొన్నప్పడు కాఫీ గింజలను ఆ ప్లాస్టిక్ డబ్బాల్లో వేసి రాత్రంతా అలాగే ఉండనివ్వాలి తర్వాత నిధానంగా రబ్ చేయాలి ఇలా చేస్తే పాత వాసనలు తొలగిపోతాయి.