దుస్తులపై పడ్డ మైనపుమరకలు తొలంచే సులభ చిట్కాలు…
1. అరటి తొక్క : క్యాండిల్ నుండి దుస్తుల మీద పడ్డ మైనపు మరకల మీద అరటితొక్కతో రుద్దాలి. మైనం దుస్తుల నుండి ఊడిరావడాన్ని మీరు గమనించవచ్చు. ఈ హోం రెమెడీ, దుస్తుల మీద పడ్డ మైనపు మరకలు వేడిగా ఉన్నప్పుడు మాత్రం వెంటనే తొలగించడానికి సులభంగా ఉంటుంది. మరియు ఎఫెక్టివ్ గా తొలగిపోతుంది. 2.మైనపు మరకల మీద ఐరన్ చేయాలి : దుస్తుల మీద పడ్డ మైనపు మరకలను తొలగించడానికి ఇది ఒక సాధరణ మార్గం. ఐరన్నింగ్ బోర్డ్ మీద రెండు పేపర్ టవల్స్ ను అమర్చాలి. తర్వాత మైనపు మరకలున్న దుస్తులను దాని మీద పరిచి, తిరగి క్లాత్ మీద పేపర్ టవల్ ను అమర్చాలి. ఇప్పుడు, ఐరన్ బాక్స్ తో ఐరన్ చేయడం వల్ల పేపర్ టవల్ కు వ్యాక్స్ అంటుకొని ఊడి వచ్చేస్తుంది. దుస్తుల మీద పడ్డ క్యాండిల్ వ్యాక్స్ ను తొలగించడానికి ఇది ఒక ఉత్తమ మరియు సులభమైన మార్గం. 3. ఫ్రీజింగ్ : దుస్తుల మీద గడ్డకట్టిన మైనపు మరకను తొలగించడానికి మరో సులభ మార్గం, 5డిగ్రీల సెల్సియస్ లో క్లాత్ ను ఫ్రీజర్ లోపెట్టాలి. అదంతట అదే తొలగిపోతుంది. మరింత గట్టగా ఉంటే, షార్ప్ గా ఉన్న కత్తితో తొలగించవచ్చు.