కొవ్వును పెరగకుండా చేసే బ్లాక్ రైస్… ఆరోగ్యానికి ఎంతోమేలు…Black Rice health entomelu that the progression of fat

కొవ్వును పెరగకుండా చేసే బ్లాక్ రైస్… ఆరోగ్యానికి ఎంతోమేలు…
సాధారణంగా ప్రతి ఒక్కరూ తెల్లన్నం తింటుంటారు. కానీ, అపుడప్పుడు కాస్తంత వెరైటీ కోసం నల్లటి బియ్యంతో తయారు చేసిన అన్నం కూడా ఆరగించాలి. ఇవి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.
బ్లాక్ రైస్‌లో ఉండే అంథోసైనిన్స్‌ అనే రసాయన పదార్థం హృద్రోగాలను అడ్డుకునే శక్తి ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. వయసు పెరిగే కొద్దీ గుండె కవాటాల్లో పూడికలొచ్చి గుండెజబ్బులొచ్చే ప్రమాదం సహజం. కొవ్వుశాతం పెరగడం కూడా దీనికి ఒక కారణం. శరీరంలో కొవ్వును పెరగకుండా చూసే లక్షణాలు బ్లాక్‌రైస్‌కు ఉందట. దీంతోపాటు అల్జీమర్స్‌, డయాబెటీస్‌, క్యాన్సర్‌ వంటి మొండి జబ్బుల్ని అడ్డుకునే శక్తి ఈ నల్ల బియ్యానికి ఉంది.