వైట్ సాక్సులను కాంతివంతంగా శుభ్రం చేయడానికి సులభ చిట్కాలు…
బ్రెష్: డర్టీ వైట్ సాక్స్ ను గోరువెచ్చని నీటిలో డిటర్జెంట్ సొల్యూషన్ తో ఒక గంట సేపు నానబెట్టుకోవాలి, దాని తర్వాత సాక్సులకు చాలా సున్నితంగా బ్రష్ వేసి, ఉతకాలి. తర్వాత మంచి నీటిలో రెండు మూడు సార్లు జాలించి తర్వాత ఎండలో వేయాలి. బ్లీచ్: కొన్నిసమయాల్లో, ఇంట్లోనే బ్లీచింగ్ ఉపయోగించి వైట్ సాక్స్ లను వాష్ చేసుకోవచ్చు. ఇది వైట్ సాక్సులు, క్లీన్ అవ్వడానికి మరియు కలర్ తగ్గకుండా ఉండటానికి బాగా సహాయపడుతుంది. నిమ్మరసం:నిమ్మరసం సిట్రస్ మరియు యాసిడ్స్ ఇది సాక్సుల యొక్క వైట్ కలర్ ను ఏ మాత్రం తగ్గనివ్వకుండా చేస్తుంది. ముఖ్యంగా మీకు కాళ్ళలో చెమట పట్టడం మరియు దుర్వాస, చెమట వాసన పోగొట్టాలంటే, నిమ్మరసాన్ని ఉపయోగించండి గోరు వెచ్చని నీటిలో కొన్ని చుక్కల నిమ్మరసం వేసి, తర్వాత డిటర్జెంట్ వేసి 30నిముషాలు నానబెట్టి, తర్వాత శుభ్రంగా ఉతికి, మంచి నీటిలో జాలించి తర్వాత ఎండలో వేసి ఆరబెట్టాలి. బేకింగ్ సోడా: వైట్ సాక్స్ లను శుభ్రపరచడానికి మరియు మెయింటైన్ చేయడానికి ఇది ఒక అద్భుత చిట్కా. గోరువెచ్చని నీటిలో ఒక చిటికెడు బేకింగ్ సోడా వేసి, మురికిబడ్డ సాక్సులను నానబెట్టి, తర్వాత బ్రష్ చేసి ఉతికి మంచినీటిలో జాలించి తర్వాత ఎండలో ఆరబెట్టుకోవాలి.