పాత్రలు మరింత సులభంగా శుభ్రం చేసుకోవడానికి చిట్కాలు… Tips to make the characters more easily be cleaned

పాత్రలు మరింత సులభంగా శుభ్రం చేసుకోవడానికి చిట్కాలు…
 డిష్ వాష్ ను మరింత సులభతరం చేసుకోవడానికి ఒక సాధారణ చిట్కా , మీరు ఉపయోగించిన వెంటనే దాన్ని శుభ్రం చేసి పక్కన పెట్టేసుకోవాలి. అంతే షింక్ నిండుగా వేయకుండా ఏదైనా పాత్రలు కనబడిన వెంటనే వాటిని శుభ్రం చేసుకోవాలి. టైమ్ సెట్ చేసుకోవాలి:  షింక్ నిండుగా వేసేసి గంటలు తరబడి వాటి శుభ్రం చేయకుండా, ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది మరియు శుభ్రం చేయడానికి తక్కువ సమయం పడుతుంది. దాంతో త్వరగా శుభ్రం చేయాలనే ఆలోచన కలుగుతుంది.  తిరిగి ఉపయోగించే పాత్రలు: వంటలు వండుటకు ఎక్కువ పాత్రలు ఉపయోగించడం నివారించాలి . ఎక్కువ వెజల్స్ ను బయటకు తీయ్యడం వల్ల అవి వంటగదిని చిందరవందర చేసేస్తాయి. తిరిగి ఉపయోగించే పాత్రలను వెంట వెంటనే శుభ్రం చేసేసుకుంటుండాలి. అలా చేస్తుంటే క్రమంగా పాత్రలు తక్కువగా పడుతాయి. మీకు శ్రమ తగ్గుతుంది.  షింక్ కు కాస్త దూరంలో పాత్రలుంచాలి: వాడిన వాటాని , వాడని పాత్రలన్నింటిని షింక్ దగ్గర్లో ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల మొత్తం, కలిసిపోయి చిందరవందరగా కనబడుతాయి. మురికిపడ్డ పాత్రలన్నీ ఒక టబ్ లో వేసి తర్వాత శుభ్రం చేసుకోవడం వల్ల షింక్ అశుభ్రంగా కనబడకుండా ఉంటుంది. మ్యూజిక్: పనిభారం ఎక్కువగా ఉన్నప్పుడు మీకు నచ్చిన మ్యూజిక్ వింటూ పని మొదలు పెడితే మీ పనిని మరింత సులభతరం చేస్తుంది. మీరు ఏకాగ్రత, పాత్రల శుభ్రం చేయడం కంటే మ్యూజిక్ మీద ఉండటం వల్ల పని భారంగా అగుపించదు మరియు త్వరగా పని పూర్తి చేయగలుగుతారు.  మీ పనిని షేర్ చేసుకోవాలి: పని ఎక్కువగా ఉన్నప్పుడు మీ పాట్నర్ యొక్క సహాయం తీసుకోవడంతో పని భారం మరింత తగ్గించుకోవచ్చు. శరీరానికి ఎక్కువ ఒత్తిడి కలగకుండా ఉంటుంది.