సిల్వర్ ప్లేట్స్ శుభ్రం చేయడానికి చిట్కాలు…
ప్రతి రోజూ సిల్వర్ ప్లేట్స్ పాలిష్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా రెగ్యులర్ గా శుభ్రం చేయడం వల్ల సిల్వర్ నాశనం అవుతుంది. అందుకు మీరు చేయాల్సిందల్లా ఒక మృదువైన వస్త్రం లేదా మృదువైన పళ్ళు ఉన్న బ్రెష్ తో తుడిచి శుభ్రం చేయాలి. ఇంకా మీరు కొన్ని సోప్ నీళ్ళు ఉపయోగించి వాటిని శుభ్రం చేయవచ్చు. మరకలు తొలగిపోతాయి. నీటితో శుభ్రం చేసిన తర్వాత ఒక మృదువైన వస్త్రం ఉపయోగించి నీటిని పూర్తిగా తుడవడానికి నిర్ధారించుకోవాలి. బేకింగ్ సోడా : బేకింగ్ సోడా సిల్వర్ ప్లేట్స్ శుభ్రం చేయడానికి మరో క్లినింగ్ ట్రిక్. గోరువెచ్చని నీటిలో ఒక గుప్పెడు బేకింగ్ సోడా వేసి, నీటిలో బేకింగ్ సోడా పూర్తిగా కరిగిపోయేవరకూ రెండు మూడు నిముషాలుండి, తర్వాత అందులో సిల్వర్ ప్లేట్స్ వేసి, నీటిలో కిద్దిసేపు నానబెట్టాలి. పదినిముషాల తర్వాత ఆ నీటిలో నుండి తీసి ఒక ఒక మృదువైన పొడి గుడ్డతో శుభ్రంగా తుడవాలి.