బరువు తగ్గాలనుకుంటున్నారా… కొర్ర గింజలను ఆరగించండి…Taggalanukuntunnara ... korra the amount of weight can help

బరువు తగ్గాలనుకుంటున్నారా… కొర్ర గింజలను ఆరగించండి…
 శరీరానికి ఎంతో మేలు చేసే కొర్రలు తృణ ధాన్యాల్లో ఒకటి. జొన్నలు, సజ్జలు, రాగులలాగే వీటిని ఎక్కువగా తినేవారు, కానీ కాలక్రమేణా వీటి వాడకం ఇప్పుడు తక్కువైంది. పోషక పదార్థాలు అధికంగా ఉండే కొర్రలను నిత్యం మన ఆహారంలో తీసుకోవడం వ‌ల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. బరువు తగ్గాలనుకునే వారు నిరభ్యంతరంగా కొర్రలను తీసుకోవచ్చు. దీని వల్ల ఎటువంటి కొవ్వు శరీరంలో చేరదు. ఇది బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. మెటబాలిజం ప్రక్రియ కూడా మెరుగుపడుతుంది. కొర్రలలో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల జీర్ణప్రక్రియ మెరుగుపడుతుంది.