దంత క్షయాన్ని తగ్గించే చెరకు రసం… ఆరోగ్యానికి ఎంతో మేలు… Sugar cane juice to reduce dental caries ... a tradition

దంత క్షయాన్ని తగ్గించే చెరకు రసం… ఆరోగ్యానికి ఎంతో మేలు…
నోటి దుర్వాసనను, దంత క్షయాన్ని తగ్గించే అనేక రకాల విటమిన్లు, మినరల్స్ చెరుకు రసంలో ఉన్నాయి. చెరుకు రసం శరీరంలోని ప్రోటీన్ లెవల్స్‌ను పెంచుతుంది. మూత్రాశయ ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి రక్షిస్తుంది. కిడ్నీల పనితనాన్ని మెరుగు పరుస్తుంది. పచ్చకామెర్ల వ్యాధి ఉన్నవారికి చెరుకు రసం మంచి ఔషధంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
చెరుకు రసంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఏర్పడే ఫ్రీ ర్యాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. దీంతోపాటు శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. ఐరన్, మెగ్నిషియం, కాల్షియం, ఎలక్ట్రోలైట్స్ దీంట్లో అధికంగా ఉంటాయి. ఇవి డీహైడ్రేషన్ సమస్య నుంచి విముక్తి కలిగిస్తుంది. సాధారణ జలుబు, ఇతర ఇన్‌ఫెక్షన్లను తగ్గించడంలో చెరుకు రసం బాగా పనిచేస్తుంది.
చెరుకు రసాన్ని తరచూ తీసుకుంటే మలబద్దకం తొలగిపోతుంది. సహజసిద్ధమైన లాక్సేటివ్ గుణాలు దీంట్లో ఉన్నాయి. కడుపులో మంట, అసిడిటీ వంటి సమస్యలను తగ్గిస్తుంది.