మీ బుక్ షెల్ఫ్‌ను అమర్చుకోండి ఇలా…
మీరు ఒక పుస్తకాల పురుగు అయి ఉండి, ఆ పుస్తకాలను ఎలా నిర్వహించాలో తెలియకపోతే, మీ ఇల్లంతా ఖచ్చితంగా టన్నుల కొద్ది పుస్తకాలతో నిండి ఉంటుంది. మీ ఇంట్లో ఉన్న పుస్తకాలను చిన్ని చిన్ని చిట్కాలను పాటించి చక్కగా అమర్చుకుందాము. అక్షర క్రమంలో అమరిక: రచయత యొక్క మొదటి అక్షర క్రమంలో పుస్తకాలను అమర్చుకోవడం ఉత్తమమైన, సులభమైన పద్దతి. కళల ప్రకారం అమరిక:కళల ప్రకారం పుస్తకాలను అమర్చుకోవడం మరియొక ఉత్తమమైన పద్దతి. హాస్యాలను, థ్రిల్లర్‌లను, కావ్యాలను, భక్తి ప్రవచనాలను, సస్పెన్స్‌లను ఇలా విభాగాలుగా పుస్తకాలను అమర్చుకోవాలి. మీ మూడ్‌ను బట్టి పుస్తకాన్ని ఎంచుకోవడానికి ఈ పద్దతి ఉపయోగ పడుతుంది. రంగుల ప్రకారం అమరిక:పుస్తకాల రంగుల ప్రకారం వాతిని వివిధ విభాగాలగా అమర్చితే ఇంట్లో ఇంద్రధనస్సులాగా అందంగా కనపడుతుంటాయి.