సపోటా పండులోని ఆరోగ్య ప్రయోజనాలు…
- శరీరం ఉత్తేజం కోల్పోయినప్పుడు , బలహీనంగా ఉన్నప్పుడు రెండు లేదా మూడు సపోటా పండ్లను తింటే నిమిషాలలో శరీరంలో మళ్లీ శక్తి పుంజుకుంటుంది. సపోటాలో సమృద్ధిగా లభించే ఫ్రక్టోస్ శరీరంలో త్వరగా శక్తి పుంజుకునేలా చేస్తుంది. సపోటా పండు రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం. ఎక్కువ కేలరీలుండే సపోటా పండుతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.
- ఈ పండు గుజ్జులో అధికంగా లభించే పీచు, పై పొట్టులో ఉండే కెరోటిన్లు మలవిసర్జన సాఫీగా జరిగేలా చూస్తాయి. సపోటా పండ్లలో మాంసకృత్తులు, కెరోటిన్లు, నియాసిన్, పిండి పదార్థాలు, ఇనుము, C విటమిన్, కొవ్వు, పీచు, థయామిన్, క్యాల్షియం, రైబోఫ్లేవిన్లు, శక్తి, ఫ్రక్టోస్ షుగర్లు ఎక్కువగా లభిస్తాయి.
- గ్లూకోజ్ ఎక్కువగా ఉండే సపోటా అతి సులువుగా జీర్ణమవుతుంది. సపోటాలోని విటమిన్ A కంటిచూపును మెరుగుపరుస్తుంది. సపోటాలో కాల్షియం, పాస్ఫరస్, ఐరన్లు ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఎముకల గట్టిదనానికి ఇవి ఎంతో ఉపయోగపడుతుంది.
- సపోటాలో విటమిన్ C శరీరంలోని హానికారక ఫ్రీరాడికల్స్‌ను తొలగిస్తుంది. తాజా పండులోని పొటాషియం, రాగి, ఇనుము, లాంటి పోషకాలు ఫోలేట్, నియాసిన్, పాంథోయినిక్ ఆమ్లాలు జీవక్రియను మెరుగుపరుస్తాయి.