బరువు తగ్గించే పెప్పర్ అండ్ క్యాబేజ్ సూప్ ఎలా తయారుచేయాలో చూద్దాం… Pepper and cabbage soup, let's look at how to reduce the weight of tayaruceyalo

బరువు తగ్గించే పెప్పర్ అండ్ క్యాబేజ్ సూప్ ఎలా తయారుచేయాలో చూద్దాం…
 కావల్సినపదార్థాలు: క్యాబేజ్: 1(సన్నగా తరిగిపెట్టుకోవాలి) క్యారెట్ : 2(పొట్టు తీసి సన్నగా తరిగిపెట్టుకోవాలి) ఉల్లిపాయలు: 2(సన్నగా తరిగి పెట్టుకోవాలి) కార్న్ ఫ్లోర్: 1/2tsp బ్లాక్ పెప్పర్: 1tsp(పొడి) ఉప్పు: రుచికి సరిపడా బట్టర్: 1tsp తయారుచేయు విధానం: 1. ముందుగా వెజిటేబుల్స్ ముక్కలన్నీ నీటిలో వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. 2. తర్వాత ప్రెజర్ కుక్కర్ స్టౌ మీద పెట్టి నీళ్ళు పోసి మరిగించాలి. 3. తర్వాత అందులో సన్నగా తరిగి పెట్టుకొన్న వెజిటుబుల్ క్యాబేజ్, క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు వేయాలి. 4. అన్ని బాగా మిక్స్ చేసి, మూత పెట్టి రెండు లేదా మూడు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించి పెట్టుకోవాలి. ఆవిరి మొత్తం తగ్గిన తర్వాత మూత తీయాలి. 5. ఇప్పుడు ఫ్రైయింగ్ పాన్‌లో బటర్ వేసి అందులో కూరగాయ ముక్కలతో సహా సూప్(కూరలు ఉడికిన నీరు)కూడా అందులో పోయాలి. 6. ఇప్పుడు అందులో బ్లాక్ పెప్పర్ మరియు సాల్ట్ కూడా వేసి బాగా మిక్స్ చాలి. 7. సూప్ చిక్కగా రావాలంటే కొద్దిగా కార్న్ ఫ్లోర్ కలిపి ఉండలు కట్టకుండా మిక్స్ చేయాలి. అంతే పెప్పర్ అండ్ క్యాబేజ్ సూప్ రెడీ. వేడి వేడిగా సర్వ్ చేయాలి. ఇది దగ్గు జలుబును నివారిస్తుంది శరీరంలో వేడి పుట్టించి కొవ్వును కరిగిస్తుంది