డ్రై ఫ్రూట్స్ మ్యాంగో లస్సీ ఎలా తయారుచేయాలో చూద్దాం… Let's see how tayaruceyalo dry fruits Mango Lassi

డ్రై ఫ్రూట్స్ మ్యాంగో లస్సీ ఎలా తయారుచేయాలో చూద్దాం…
 కావల్సిన పదార్థాలు: పెరగు: 1cup మామిడికాయ: 1(పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి) బాదంం 4-5(పొడి చేసుకోవాలి) పిస్తాలు: 3-4(పొడిచేసుకోవాలి) పంచదార: 3tsp రోజ్ వాటర్: కొద్దిగా(రెండు మూడు చుక్కలు) ఐస్ క్యూబ్స్ం 3-4 తయారుచేయు విధానం : 1. ముందుగా పెరుగు ఒక గిన్నెలో వడగట్టుకోవాలి. 2. తర్వాత మిక్సీ జార్‌లో వడగట్టుకొన్న చిక్కటి పెరుగు, మామిడిముక్కలు, కొద్దిగా నీళ్ళు పోయాలి. అందులోనే పంచదర కూడా వేసి గ్రైండ్ చేయాలి. 3. ఇలా గ్రైండ్ చేసుకొన్న మిశ్రమంలో రెండు మూడు చుక్కల రోజ్ వాటర్ వేసి మరో సారి గ్రైండ్ చేసుకోవాలి. 4. ఇప్పుడు గ్రైండ్ చేసుకొన్న దాన్ని వేరే గిన్నెలోకి వడపోసుకోవాలి. ఇలా చేడయం వల్ల ఫైబర్ మరియు మామిడి ముక్కలు తొలగించవచ్చు. 5. తర్వాత ఒక గ్లాసు తీసుకొని అందులో ఐస్ ముక్కలు వేసి, తర్వాత వడగట్టి పెట్టుకొన్న మ్యాంగో లస్సీ వేసి, డ్రైఫ్రూట్స్ పొడి, పలుకలతో గార్నిష్ చేయాలి. మీకు ఇష్టం అయితే గ్రైండ్ చేసేప్పుడే కొన్ని డ్రై ఫ్రూట్స్ ను వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. అంతే డ్రైఫ్రూట్ మ్యాంగో లస్సీ రెడీ.