బెడ్ ఎంపిక చేసుకోవడానికి ముందు గమనించాల్సిన విషయాలు…Notes prior to the selection of bed

బెడ్ ఎంపిక చేసుకోవడానికి ముందు గమనించాల్సిన విషయాలు…
 మీరు పరుపులు ఎన్నుకునే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ ఇవ్వబడ్డాయి...  1. ఇప్పటికే ఉన్న మీ పరుపు వయస్సు(గడువు): మీరు నిద్రపోయేటపుడు సమస్యగా ఉంటే, ఆ సమస్య మీ పరుపులో లేదు, దాని వయసులో ఉండవచ్చు. ప్రతి పరుపుకి గడువు తేదీ ఉంటుంది. కొంత సమయం అయిన తరువాత, పరుపులు వాటి సహజ సౌకర్య నాణ్యతను ఎక్కువకాలం కలిగి ఉండవు.  2. మీరు నిర్ధారించుకునే ముందు పరీక్షించండి: ఒకసారి మీ మనసు నిర్దిష్ట పరుపుపై ఉన్నట్లయితే, కనీసం 10 నుండి 15 నిముషాలు దానిపై కూర్చుని ప్రయత్నించండి. దీనివల్ల దాని సౌకర్యాన్ని, మన్నికను తెలుసుకోవచ్చు. కొనుగోలులో పెద్ద హడావిడి పడొద్దు, అమ్మకందారుని ప్రభావం వల్ల మీరు నిర్ణయం తీసుకోవద్దు.  3. అన్ని ఎంపికలని, వ్యత్యాసాలని తనిఖీ చేయండి: పరుపు సంస్ధ, దాని అందమైన శైలి, పైన ది౦డుతో కలిసి ఉందో లేదో, దాని బ్రాండ్ హామీ అన్నీ చూడండి. మధ్యవర్తి ద్వారా నిర్ణయం తీసుకోవద్దు. నిజమైన పరుపుల దుకాణంలో కొనుగోలు చేయండి.  4. డిపార్టుమెంటు స్టోర్ లో కొనుగోలు మానండి: పరుపుల దుకాణంలోని అమ్మకందారులు సాధారణంగా బాగా శిక్షణ పొంది ఉంటారు, మీరు సరైన ఎంపిక చేసుకోవడానికి వారి నైపుణ్యం ఎంతో సహాయ పడుతుంది.  5. వారెంటీ తనిఖీ చేయడం మరిచిపోవద్దు: మంచి పరుపులకు కనీసం 10 సంవత్సరాల ‘పూర్తి' వారెంటీ లేదా ‘నాన్-ప్రోరేటేడ్ వారెంటీ' ఉంటుంది.