దుస్తులకు గంజి పెట్టడానికి సహజ పద్దతులు…
కాటన్ దుస్తులు స్టిఫ్ గా ఉంటేనే చూడటానికి అందంగా కనబడుతాయి. ఇంట్లో నేచురల్ పదార్థాలతో రెగ్యులర్ గా దుస్తులకు గంజి పెట్టుట వల్ల దుస్తులకు ఎటువంటి హాని జరగదు, చిరగడం లేద కలర్ పోవడం వంటివి జరగవు.నేచురల్ పద్దతుల్లో దుస్తులకు గంజి పెట్టుట వల్ల మీ దుస్తులు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. మరి ఆ నేచురల్ పదార్థాలేంటి మరియు వాటిని ఎలా ఉపయోగించాలని తెలుసుకుందాం... రైస్ వాటర్(గంజి) : ప్రెజర్ కుక్కర్ లో అన్నం వండకుండా సపరేట్ గా గిన్నెలో వండుకొంటే మంచిది. అన్నం వండటానికి సరిపడా కంటే మరికొన్ని ఎక్కువ నీళ్ళు పోసి అన్నం ఉడికిన తర్వాత గంజి సపరేట్ గా వంపుకోవాలి . తర్వాత గంజి చల్లబడిన తర్వాత అందులో మరికొన్ని నీళ్ళు పోసి తర్వాత దుస్తులను ఆ నీటిలో డిప్ చేయాలి. ఇది ఎక్కువ మంది ఉపయోగించే నేచురల్ పద్దతి. గోధుమలు : బియ్యం లాగే వీటిని కూడా నేచురల్ గా గంజి పెట్టించవ్చు. గోధుమలు ఉడికించిన నీటిని వేరే గిన్నెలోకి వంపుకొని, చల్లారిన తర్వాత దుస్తులను అందులో డిప్ చేసి ఎండలో వేయడం వల్ల దుస్తులు స్టిఫ్ గా ఉంటాయి. కార్న్ స్ట్రార్చ్ : కార్న్ స్టార్చ్ (మొక్కజొన్న పిండి) ని 15mlతీసుకొని, చల్లటి నీటిలో వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఈ నీటిలో ఒక నిముషం బాగా మరిగించాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని స్పే బాటిల్లో వేసి ఉపయోగించుకోవచ్చు. లేదా పూర్తింగా బకెట్లో వేసి జాలించవచ్చు. బంగాళదంపు నీళ్ళు : నేచురల్ పద్దతిలో గంజి తయారుచేయడానికి రెండు మూడు బంగాళదుంపలు తీసుకోవాలి. ఈ బంగాళ దుంపలను నీటిలో వేసి ఉడికించాలి. తర్వాత ఈ నీటిని రాత్రంతా అలాగే ఉంచాలి. తర్వాత రోజు ఉదయం నీరు వడగట్టుకొని దుస్తులకు పట్టించవచ్చు.