డైనింగ్ టేబుల్ ను అందంగా సర్దేద్దాం ఇలా…
మీ డైనింగ్ టేబుల్ శుభ్రంగా ఉంచడానికి కొన్ని చిట్కాలు... 1. మీ డైనింగ్ టేబుల్ డిజైన్‌కి తగ్గ క్లాత్‌ని సెలెక్ట్ చేసి దానిమీద వేస్తే డైనింగ్టేబుల్ అందంగా కన్పిస్తుంది. కాబట్టి మంచి డిజైన్ ఉన్న క్లాత్‌ని ఎంపిక చేసుకోవాలి. 2.వంటింట్లో వండిన పదార్థాలు టేబుల్‌పైన పెట్టే ముందు చిన్న స్టీల్‌స్టాండ్‌ను టేబుల్‌పైన ఉంచి వాటిపైన ఆ పదార్థాల పాత్రల్ని పెట్టాలి. ఇలా చేయడం వల్ల టేబుల్‌పైన ఎలాంటి గీతలు పండేందుకు అవకాశం ఉండదు. 3. ఉదయం టిఫిన్ ఐటెమ్స్ చట్నీ, హాట్‌బాక్స్‌లో ఇడ్లీలు, వేరేవి ఏవైనా ఉంటే వాటిని నీట్‌గా టేబుల్‌పైన సర్దాలి. 4. కుటుంబ సభ్యులు తినే టైంలోనే ప్లేట్లు, నీళ్లగ్లాసులు ఉంచాలి. తిన్నవెంటనే ఆ సామాన్లు తోమేందుకు వేసేయాలి. ఎట్టి పరిస్థితులలోనూ తినేసిన కంచాలు, ప్లేట్లను టేబుల్‌పైన ఉంచకూడదు. 5. డైనింగ్ టేబుల్ పై అన్ని వస్తువులు తీసేసి సబ్బునీళ్లలో తడిపిన బట్టతో లేదా స్పాంజ్‌తో తుడిచి ఆరబెట్టాలి. ఆ తర్వాత పొడిబట్టతో తుడవాలి. 6. ఈ రోజుల్లో చిన్నగ్లాస్‌లో నీరు పోసి పెంచే మొక్కల్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటున్నారు. మీకు అలాంటి టేస్ట్ ఉంటే అందంగా అలంకరించుకోండి. అయితే ఒక్క సంగతి మాత్రం మరువకండి. ప్లాంట్‌లో పోసిన నీటిని రోజు విడిచి రోజు మార్చాలి. ఇలాంటి చిట్కాలు పాటించడం వల్ల మీ డైనింగ్ టేబుల్ ఎంతో అందంగా కన్పిస్తుంది. అంతేకాదు మీ ఆరోగ్యం పదికాలాల పాటు పదిలంగా ఉంటుంది.