లంచ్ బాక్స్ లో వాసన, ఆయిల్ జిడ్డు తొలగించే టిప్స్… Lunch box odor , oil, grease removers Tips

లంచ్ బాక్స్ లో వాసన, ఆయిల్ జిడ్డు తొలగించే టిప్స్…
 నివారణ : ప్లాస్టిక్ తో తయారుచేసిన లంచ్ బాక్స్ లనుండి పూర్తిగా వాసనను నివారించాలంటే ఆ డబ్బలను ఆరుబయట ఎండలో ఉంచాలి. మళ్ళీ తిరిగి రాత్రి వాటిని లోపలికి తీసుకు రావడం వల్ల వాసన తొలగించబడి ఉంటుంది. ఇలా లంచ్ బాక్స్ లను ఉపయోగించన ప్రతి రోజూ ఈ పద్దతినే అనుసరించండి మంచి ఫలితం ఉంటుంది... న్యూస్ పేపర్ పద్దతి : హాట్ సోప్ వాటర్ తో లంచ్ బాక్స్ ను పూర్తిగా శుభ్రం చేసి, తర్వాత వాటిని పూర్తిగా తడి ఆరేలా బయట ఎండలో కానీ, లేదా నీడలో కానీ ఉంచి తర్వాత బాక్స్ లోపల కొంత న్యూస్ పేపర్ ను చుట్టు మూత టైట్ గా వేసి ఒకటి రెండు రోజులు అలాగే ఉంచాలి. రెండు రోజుల తర్వాత పేపర్ ను తొలగించాలి. వాసన పూర్తిగా తొలగి పోయినట్లైతే వాటర్ తో కడిగి తర్వాత ఆహారం నింపాలి... వెనిగర్ : వెనిగర్ మరియు వాటర్ మిక్స్ చేసి ప్లాస్టిక్ కంటైనర్ లో నింపి కొద్ది సమయం అలాగే ఉంచాలి. కొద్ది సమయం తర్వాత కడిగేసి మళ్ళీ ఒక సారి ప్రయత్నించవచ్చు... రీప్లేస్ : అనుకోకుండా, ప్లాస్టిక్ డబ్బాలో వాసన చాలా స్టాంగ్ గా ఉన్నట్లైతే, ప్లాస్టిక్ డబ్బాను మార్చండి. ఆయిల్ స్మెల్ ను నిర్మూలించడానికి ప్లాస్టిక్ కాకుండా ఫైబర్ కంటైనర్ ను ఎంపిక చేసుకోండి...