షూ దీర్ఘకాలం మన్నికగా ఉంచేందుకు క్లీనింగ్ టిప్స్…
1. ముందుగా బూట్లకు, లేదా చెప్పులకు వున్న దుమ్ము పూర్తిగా దులపండి. బూట్లు మీద మరకలు ఉంటే ఒక కాటన్ గుడ్డను సోప్ నీటిలో తడిపి బూట్లను తుడవండి. ఈ చర్య బూట్లపైనా, చెప్పులపైనా వున్న మరకలను పోగొడుతుంది. 2. తెల్లని కాన్వాస్ బూట్లు లేదా చెప్పులు మెషీన్ లో వేసి వాష్ చేయాలనుకుంటే వాటి లేసులు తీసి వేడినీటిలో కడగండి. అవసరమైన డిటర్జెంట్ వాడండి. బ్లోయర్ వాడవద్దు. ఇది వాడితే షూస్ పాడవుతాయి. 3. బ్లీచ్, బేకింగ్ సోడా, లేదా కొద్దిపాటి డిటర్జెంట్ ను నీటిలో కలపండి. ఆ మిశ్రమంలో ఒక టూత్ బ్రష్ ముంచి మరకలు పోయేటంతవరకు వైట్ షూస్ శుభ్రం చేయండి. 4. మరో చిట్కాగా, తెల్లటి బూట్లను, చెప్పులను శుభ్రపరచేందుకు టూత్ పేస్ట్ వాడండి. బ్రష్ ను వేడి నీటిలో ముంచి కొద్దిపాటి టూత్ పేస్ట్ ను బూట్లపై రుద్దండి. తర్వాత నీటితో కడిగి టవల్ లేదా గుడ్డతో బాగా తుడవండి. 5. మీ లెదర్ షూ వాడుకను బట్టి మీ షూలను వారానికొకసారి లేదా నెలకొకసారి పాలిష్ చేస్తుండాలి. అందుకు క్రీమ్ బేస్డ్ పాలిష్ చేయడం వల్ల ఎక్కువ రోజులు కొత్తవాటిలా మెరుస్తుంటాయి. పాలిష్ చేసిన తర్వాత ఒక కాటన్ వస్త్రం మీద చిటికెడు కొబ్బరి నూనె వేసి షూమీద సున్నితంగా తుడవాలి. ఇలా చేయడం వల్ల షూ ఎక్కువ రోజులు మెరుస్తుంటాయి.