గుల్కన్ గులాబ్ జామ్ ఎలా తయారుచేయాలో చూద్దాం…
కావలసిన పదార్థాలు: కోవా లేదా గుల్కన్: 1cup పాలు: 1cup పంచదార: 2cups గులాబ్ జామ్ పౌడర్: 200grm జీడిపప్పు: 50grms బాదం పప్పు: 50grsm పాకానికి పంచదార: 1/2kg నెయ్యి: 1/2cup(వేగించడానికి) యాలకుల పొడి: 1tsp తయారు చేయు విధానం: 1. ఒక పాన్ స్టవ్‌పై ఉంచి, కొద్దిగా నెయ్యి వేసి ముందుగా అందులో జీడిపప్పు, బాదంపప్పు ముక్కలు వేసి వేగించాలి. 2. తరువాత మరో పాత్ర స్టవ్ పై ఉంచి అందులో కొద్దిగా నీళ్లు, పంచదార వేసి లేత పాకం వచ్చే వరకు గరిటెతో కలుపుతూ ఉండాలి. సువాసన కోసం ఈ పాకంలో యాలకుల పొడిగాని, రోజ్ వాటర్గాని ర్ కలుపుకోవచ్చు. 3. తర్వాత గులాబ్‌జామ్ పౌడర్‌లో పాలు పోసి ఉండలు చేసుకునేందుకు వీలుగా పిండిని కలిపి అయిదు నిమిషాల పాటు నాననివ్వాలి. 4. తర్వాత చిన్న చిన్న ఉండలు చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అందులో గులాబ్ జామ్ పిండిని కొద్దిగా చేతిలోకి తీసుకుని చిన్న పూరీలా ఒత్తి అందులో గుల్కన్ లేదా కోవా ఉంచి అంచులు కలిపేసి ఉండగా చేసుకోవాలి. 5. ఇలా తయారైన ఉండలను చిన్న మంటపై ముదురు రంగు వచ్చేంత వరకు నేతిలో వేగించి తీసి ముందుగా తయారు చేసి పెట్టుకొన్న పంచదార పాకంలో వేయాలి. 6. బాదం, జీడిపప్పులను గార్నిష్‌గా అలంకరించి సర్వ్ చేయాలి అంతే గుల్కన్ గులాబ్ జామ్ రెడీ.