బీట్ రూట్ అండ్ పీస్ పులావ్ రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం… Let's see how tayaruceyalo beet root and Peace pulav recipe

బీట్ రూట్ అండ్ పీస్ పులావ్ రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం…
 కావల్సిన పదార్థాలు: బీట్ రూట్ - 1 cup (chopped) పీస్(పచ్చిబఠానీలు): 1cup రైస్ - 2 cups పచ్చిమిర్చి - 4 to 5 గరం మసాలా - 1 teaspoon ధనియాలపొడి - 1 teaspoon బిర్యానీ ఆకులు - 2 ఉల్లిపాయలు - 1 cup జీలకర్ర - 1/4th teaspoon యాలకలు - 3 to 4 పెప్పర్ - 1/4th teaspoon జీడిపప్పు - 8 to 10 ఉప్పు: రుచికి సరిపడా నూనె: తగినంత తయారుచేయు విధానం: 1. ముందుగా కుక్కర్ స్టౌ మీద పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడి అయ్యాక అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, బిర్యానీ ఆకులు, జీలకర్ర, మరియు పచ్చిమిర్చి వేయాలి. 2. తర్వాత గరం మసాలా, ధనియాలపొడి, యాలకలు, పెప్పర్ మరియు జీడిపప్పు వేసి, ఒక నిముషం వేగించుకోవాలి. 3. ఇప్పుడు అందులోనే సన్నగా కట్ చేసిన బీట్ రూట్, పచ్చిబఠానీలు, ఉప్పు కూడా వేసి, ఒక నిముషం వేగించుకోవాలి. 4. తర్వాత ఇందులోనే కడిగిపెట్టుకొన్న బియ్యాన్ని వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో మూడు కప్పుల నీరు పోసి మొత్తం మిక్స్ చేసి మూత వేయాలి. తర్వాత రెండు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి. 5. అంతే రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి ఆవిరి పూర్తిగా తగ్గిన తర్వాత మూత తీసి సర్వింగ్ ప్లేట్‌లో తీసుకొని రైతాతో సర్వ్ చేయాలి. అంతే వేడివేడి బీట్ రూట్ పీస్ పులావ్ రెడీ.