అందమైన మెడ కోసం…
రోజుకు కనీసం రెండుసార్లు మూడు లేదా నాలుగు నిమిషాలపాటు మెడను పైకి ఎత్తడం, వంచడం, అటూ ఇటూ తిప్పడం చేయాలి. ఇందువల్ల మెడ కండరాలు చక్కగా పనిచేస్తాయి. కొద్దిగా గ్లిజరిన్ తీసుకుని అందులో కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రిపూట పడుకునేటపుడు మెడకు రాసి, ఉదయాన్నే శుభ్రం చేసుకుంటే, కొద్దిరోజుల్లోనే మెడ మెరిసిపోతుంది.