నిమ్మరసం వల్ల బహు ప్రయోజనాలు…
దోమల నివారణకు: ఒక బౌల్లో నిమ్మరసం మరియు కొన్ని లవంగాలు వేసి, దోమలున్న చోటు లేదా బెడ్ రూమ్ లో ఉంచుకోండి. క్లీనర్: నిమ్మరసంను బహు విధాలుగా ఉపయోగించుకోవచ్చు. అందుకు మీరు చేయాల్సిందల్లా నిమ్మరం మరియు నీళ్ళు సమంగా తీసుకొని స్ప్రే బాటిల్లో వేసి స్ప్రే చేసి శుభ్రం చేసుకోవచ్చు. ఇది వంట గది నుండి బాత్రూమ్ వరకూ అన్ని రకాలుగాను క్లీనింగ్ ఏజెంట్ గా ఉపయోగపడుతుంది. ఆపిల్స్ ఫ్రెష్ గా ఉంచుతుంది: ఆపిల్స్ ఫ్రెష్ గా ఉండాలంటే, కలర్ మారకుండా ఉండాలన్నా. కొద్దిగా నిమ్మరసంను వాటి మీద చిలకరించాలి . ఎక్కువ కాలం ఆపిల్స్ ఫ్రెష్ గా ఉంటాయి. ఇంట్లో మంచి సువాసన: ఇంట్లో అనుకోని, దుర్వాసనలు నివారించడంలో నిమ్మరసం బెస్ట్. కొన్ని నిమ్మతొక్కలు లేదా నిమ్మరసం నీటిలో వేసి మరిగించడం వల్ల ఆ వాసన ఇల్లు మొత్తం స్ప్రెడ్ అవుతుంది. చాలా ఫ్రెష్ గా ఫీలవుతారు.