డార్క్ లిప్స్‌ను పింక్ అండ్ సాఫ్ట్‌గా మార్చే గ్లిజరిన్…
- పెదాలను సాఫ్ట్‌గా మార్చుతుంది: గ్లిజరిన్‌లో ఉండే మాయిశ్చరైజింగ్ లక్షణాలు పొడిబారిన పెదాలకు మరియు పగిలిన పెదాలకు ఒక పర్ఫెక్ట్ రెమెడీ. ముఖ్యంగా వింటర్ సీజన్‌లో లిప్స్ పగుళ్ళు, చీలడం, కొన్ని సందర్భాల్లో బ్లీడింగ్ వంటి సమస్యలన్నింటికి గ్లిజరిన్ అద్భుతంగా సహాయపడుతుంది. - పెదాలను పింక్‌గా మార్చుతుంది: డార్క్ లిప్స్‌తో బాధపడే వారు, గ్లిజరిన్‌ను ప్రతి రోజూ ఉపయోగించడం వల్ల పింక్ కలర్ లిప్స్‌ను పొందవచ్చు. రాత్రి నిద్రించడానికి ముందు గ్లిజరిన్‌ను పెదాలకు అప్లై చేయాలి. ఈ రెగ్యులర్‌గా చేస్తూ కొన్ని రోజుల తర్వాత డిఫరెన్స్‌ను గుర్తించండి. - పెదాలు మాయిశ్చరైజింగ్‌గా ఉంటాయి: సున్నితమైన పెదాల కోసం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. పెదాలను ఎప్పుడూ తేమగా ఉంచుకోవాలి. రోజంతా తేమగా, మాయిశ్చరైజింగ్‌గా ఉన్నప్పుడు, పెదాలు చూడటానికి అందంగా కనబడుతాయి. ఇతర కాస్మోటిక్ లిప్ బామ్స్ కంటే గ్లిజరిన్ ఉత్తమమైనది ఇది పెదాలకు తగిన మాయిశ్చరైజర్‌ను అందివ్వడంతో పాటు, తేమగా ఉంచుతుంది.