చోపింగ్ బోర్డ్ క్లీన్ చేయడానికి టిప్స్… Coping tips to clean the board

చోపింగ్ బోర్డ్ క్లీన్ చేయడానికి టిప్స్…
 సాల్ట్ స్ర్కబ్: చోపింగ్ బోర్డ్ మీద వెజిటేబుల్స్ కట్ చేసినప్పుడు సందుల్లో మిగిలిపోయి బ్లాక్ మరకలు ఏర్పడుతాయి. ఇలాంటి బ్లాక్ మరకలు తొలగించడం కొంచెం కష్టమే. అందుకు ఒక నిమ్మతొక్క తీసుకొని దాని మీద కొద్దిగా ఉప్పు చిలకరించి చోపింగ్ బోర్డ్ మీద రుద్ది శుభ్రం చేయాలి. చింతపండు గుజ్జు: చింతపండు గుజ్జుకు కొద్దిగా ఉప్పు మిక్స్ చేసి శుభ్రం చేయడం వల్ల ఇది ఇక గ్రేట్ క్లీనింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఈ రెండింటి మిశ్రమంతో చోపింగ్ బోర్డ్ ను రుద్ది శుభ్రం చేయాలి. ఎలాంటి మొండి మరకలైనా తొలగించాలంటే చింతపండు నీటిలో మొదట నానబెట్టి తర్వాత శుభ్రం చేయాలి. నిమ్మరసం: మీరు రెగ్యులర్ గా పచ్చిఅరటికాయ, బీట్ రూట్ వంటివి కత్తిపీట మీద తరిగినప్పుడు, మరకలు తప్పనిసరిగా ఏర్పడుతాయి. ఇవి తొలగించాలంటే నిమ్మరసం గ్రేట్ గా సహాయపడుతుంది. కాబట్టి నిమ్మరసాన్ని కొద్దిగా అప్లై చేసి కొద్దిసేపు అలాగే ఉంచాలి. తర్వాత నిమ్మకాయ తొక్కను తీసుకొని మరకల మీద బాగా రుద్దాలి. అంతే మొండి మరకలు చాలా సులువుగా తొలగిపోతాయి.