వర్షకాలంలో సోఫాలకు చెమ్మతగలనీయకుండ తీసుకోవలసిన జాగ్రత్తలు…
1. సోఫాలను కవర్లతో సరిపెట్టకుండా వాటి కింద ఓ ప్లాస్టిక్ షీట్‌ను కూడా వేయాలి. ఇలా చేయటం వల్ల కుషన్లు పాడవకుండా కాపాడుకోవచ్చు. అలాగే మంచంపై వాడే పరుపుపై కూడా ప్లాస్టిక్ కవర్ వేయటం మర్చిపోకూడదు. 2. మంచి చెక్కతో తయారైన ఫర్నీచర్‌ను కిటికీల పక్కగా పెట్టుకోకూడదు. ఒకవేళ అలా పెట్టినట్లయితే వర్షం పడే సమయాలలో చినుకులు పడటం వల్ల అవి తడిసి పాడవటమే కాకుండా ఉబ్బుతాయి. 3. తేమ ఎక్కువగా ఉన్న ఇళ్లలో సోఫాలు చెమ్మగిల్లే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు సోఫాలు, కుర్చీలను ఓ మెత్తని పొడిబట్టతో తుడవటం చాలా అవసరం. 4. సోఫాల వెనుక వైపున గాలి తగలని చోట ఫంగస్ పెరుగుతున్నట్లుగా అనిపిస్తే గోరువెచ్చని నీటిలో డెట్టాల్ కలిపి, మెత్తని పొడిబట్టను అందులో ముంచి ఫంగస్ ఉన్నచోట రుద్దాలి. 5. వార్డ్ రోబ్‌లు, కప్‌బోర్డులు లాంటి వాటిని గోడలకు కనీసం ఆరు అంగుళాల దూరంలో ఉండేలా అమర్చుకోవాలి. లేకపోతే గోడలు చెమ్మగిల్లే ఇళ్లలో ఫర్నీచర్ కూడా చెమ్మగిల్లి త్వరగా పాడయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.