దువ్వెన/హెయిర్ బ్రష్ ను శుభ్రం చేయడానికి సులభ చిట్కాలు… Comb / hair brush handy tips to clean

దువ్వెన/హెయిర్ బ్రష్ ను శుభ్రం చేయడానికి సులభ చిట్కాలు…
 ముందుగా దువ్వెనలో ఉన్న తెగిపోయిన లేదా రాలిపోయిన జుట్టుని టూత్ పిక్ సాయంతో బయటకు తీసేయాలి. ఒక వేళ హెయిర్ బ్రష్ అయితే టూత్ పిక్ తో తీయడం కష్టమనిపిస్తే పెన్ లేదా పెన్సిల్ తో జుట్టుని వదులు చేయాలి. తర్వాత కత్తెర సాయంతో వాటిని ఎక్కడికక్కడ కట్ చేసి తూట్ పిక్ తో బయటకు తీసేయవచ్చు. 1. మీరు జుట్టుకి జెల్స్, క్రీమ్స్ వంటివేమైనా అప్లై చేస్తారా? అయితే మీరు తల దువ్వుకున్న వెంటనే హెయిర్ బ్రష్ లేదా దువ్వెనను షాంపుతో ఓసారి కడిగేసుకోవాలి. లేదంటే దువ్వెనకు అంటుకున్న జెల్ లేదా క్రీమ్ కు దుమ్ము, ధూళి ఆకర్షితమవుతాయి. ఫలితంగా జుట్టు పాడై రాలిపోతుంది. 2. గోరువెచ్చని నీరు, వెనిగర్ అరకప్పు చొప్పున తీసుకొని దువ్వెన లేదా హెయిర్ బ్రష్ ను నానబెట్టాలి. అలా 15 నుంచి 20నిముషాలు నానబెట్టిన తర్వాత బయటకు తీసి షాంపూతో శుభ్రం చేసుకోవాలి. 3. ఇవన్నీ కాకుండా దువ్వెనను నీళ్ళలో నానబెట్టి ఒక పాత బ్రష్ తీసుకొని దాని మీద టూత్ పేస్ట్, షాంపూ, సబ్బు, ఇలా ఏదైనా తీసుకుని దాంతో దువ్వెన /హెయిర్ బ్రష్ ని బాగా శుభ్రం చేయాలి. తర్వాత కడిగేసి ఆరబెట్టుకుంటే సరి. 4. ఉత్తమమైన పని తల దువ్వుకున్న వెంటనే అందులో ఉన్న వెంట్రుకలు తీసేసి దువ్వెనను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.