జుట్టు సమస్యలకు ఆముదమే బెస్ట్… Best of castor oil for hair problems

జుట్టు సమస్యలకు ఆముదమే బెస్ట్…
 ఆముదం నూనెలో ఓమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ మరియు ఓమేగా 9 ఫ్యాటీయాసిడ్స్ ఉండటం వల్ల, ఈ రెండు హెయిర్ గ్రోత్‌ను ప్రోత్సహిస్తుంది. రెగ్యులర్‌గా ఆముదం నూనె  ఉపయోగించడం వల్ల జుట్టు ఒత్తుగా పెరగడంతో పాటు, బ్యూటీఫుల్‌గా మరియు షైనీగా ఉంటుంది. ఆముదంనూనెలో ఉండే యాంటీబ్యాక్టీరియల్, యాంటీ వైరల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రును నివారించడంలో బాగా సహాయపడుతుంది. అంతే కాదు ఆముదం నూనెను రెగ్యులర్‌గా తలకు పట్టించడం వల్ల తలలో దురద, బట్టతలను నివారిస్తుంది. కొందరి జుట్టు నలుపు తగ్గి రాగి రంగులో కనిపిస్తుంది. అప్పుడు పావుకప్పు కొబ్బరి నూనెలో మూడు స్పూన్ల మందార రేకల పొడి వేసి మరిగించాలి. కొబ్బరి నూనె సగం అయ్యాక దానికి రెండు స్పూన్ల ఆముదం కలిపి తలకు రాసుకొని మరుసటి రోజు ఉదయం తల స్నానం చేయాలి. ఇలా చేయటం వలన జుట్టు క్రమంగా నలుపు రంగులోకి మారుతుంది.