బాత్ రూమ్ టైల్స్ ను శుభ్రం చేయడానికి సులభ చిట్కాలు… Bathroom tiles handy tips to clean

బాత్ రూమ్ టైల్స్ ను శుభ్రం చేయడానికి సులభ చిట్కాలు…
- సర్ఫేస్‌ను ముందుగా డ్రై చేయాలి: స్నానాల గది ఉపయోగించిన ప్రతి సారి బాత్రూమ్ సర్ఫేస్ మీద తడిలేకుండా చూడాలి. ఇలా చేయడం వల్ల అదనపు మురికి, పాచినితొలగించవచ్చు. ఇది ఒక ఎఫెక్టివ్ బాత్రూమ్ ఫ్లోర్ క్లీనింగ్ టిప్.  - ఆ ప్రదేశంను టైల్ క్లీనర్ తో కవర్ చేయాలి:తరువాత ఫ్లోర్ మీద కానీ, టైల్స్ మీద కానీ రెగ్యులర్ గా ఉపయగించే క్లీనర్ ను వేసి, క్లీనర్ తో శుభ్రం చేస్తుండాలి. అయితే ఎక్కువగా ఉపయోగించకూడదు. బాత్రూమ్ క్లీనర్ ను సర్ఫేస్ మీద వేసినా అరగంట కంటే ఎక్కువ సమయం ఉంచకూడదు.  - హార్డ్ బ్రష్ తో రుద్ది కడగాలి: తరువాత టైల్స్ ను హార్డ్ బ్రష్ ఉపయోగించి రుద్ది కడగాల్సి ఉంటుంది. అలాగే మీరు మీపాత బాత్రూమ్ బ్రష్ ను ఉపయోగించి కూడా టైల్స్ ను శుభ్రం చేసుకోవచ్చు. బాత్రూమ్ క్లీన్ చేయాడానికి ఇది ఒక ఉత్తమ పద్దతి.  - వాటర్ తో శుభ్రంచేయాలి: పాచి మరియు మురికిని క్లీనర్ మరియు హార్డ్ బ్రష్ తో తొలగించిన తర్వాత, నీరు ఉపయోగించి టైల్ క్లీనర్ ను కడిగేయాలి మరియు తడి ఆరనివ్వాలి.