పొద్దుతిరుగుడు విత్తనాల్లోని (సన్‌ఫ్లవర్ సీడ్స్‌లోని) ఆరోగ్య ప్రయోజనాలు…Vittanalloni sunflower ( Sunflower Seeds ) Health Benefits

పొద్దుతిరుగుడు విత్తనాల్లోని (సన్‌ఫ్లవర్ సీడ్స్‌లోని) ఆరోగ్య ప్రయోజనాలు…
 సన్‌ఫ్లవర్ సీడ్స్ విటమిన్ E, సెలీనియం మరియు కాపర్‌ను కలిగి ఉంటాయి. ఇవి నేచురల్ యాంటీఆక్సిడెంట్స్. ఈయాంటీఆక్సిడెంట్స్ క్యాన్సర్‌కు కారణం అయ్యే సెల్యులార్ డ్యామేజ్‌ను నివారిస్తాయి మరియు కొలన్ క్యాన్సరును నియంత్రణలో ఉంచుతుంది. సన్‌ఫ్లవర్ సీడ్స్ మెగ్నీషియంకు ఒక ఉత్తమ మూలం. ఎముకల ఆరోగ్యానికి క్యాల్షియంతో పాటు మెగ్నీషియం కూడా చాలా అవసరం అవుతుంది. పొద్దుతిరుగుడు విత్తనాల్లో ఉండే మెగ్నీషియం ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది. సన్‌ఫ్లవర్ సీడ్స్‌లో ఉండే మెగ్నీషియం ఒత్తిడిని తగ్గిస్తాయి. నాడీవ్యవస్థను ప్రశాంతపరిచి స్ట్రెస్ తగ్గిస్తుంది దాంతో మైగ్రేన్ తలనొప్పి తగ్గించుకోవచ్చు. సన్‌ఫ్లవర్ సీడ్స్ కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. అంతే కాదు వీటిలో ఉండే హై ఫైబర్ కంటెంట్ బరువు తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. దీనిలో పాలీ అన్‌సాచ్యురేటెడ్‌ కొవ్వు ఆమ్లాలు, ఒమెగా 6 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. సన్‌ఫ్లవర్ సీడ్స్‌లో ఉండే విటమిన్ C కార్డియో వ్యాస్కులర్ డిసీజ్‌ను తగ్గిస్తుంది మరియు ఇది ఫ్రీరాడికల్స్‌తో పోరాడటం వల్ల హార్ట్ అటాక్ మరియు స్ట్రోక్‌ను నివారిస్తుంది. సన్‌ఫ్లవర్ సీడ్స్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు బౌల్ మూమెంట్‌ను మరింత సులభం చేస్తుంది. దాంతో మలబద్దక సమస్య ఉండదు.