మిక్సర్ గ్రైండర్ ను శుభ్రం చేయడానికి చిట్కాలు…
నిమ్మ తొక్క: నిమ్మ కాయ నుండి నిమ్మరసంను పూర్తిగా పిండుకొన్న తర్వాత ఆ తొక్కను ఉపయోగించుకోవచ్చు. మిక్సర్ గ్రైండర్ నుండి వచ్చే చెడు వాసనను తొలగించడానికి నిమ్మతొక్క బాగా సహాయపడుతుంది. నిమ్మతొక్కతో మిక్సీ జార్ మీద బాగా రుద్ది 15నిముషాల తర్వాత శుభ్రం చేయడం వల్ల వాసనతొలగిపోతుంది. మరకలను తొలగించే వెనిగర్ : కొన్న వెజిటేబుల్స్ వల్ల మిక్సీ జార్ల మీద మొండి మరకలు ఏర్పడుతాయి. వీటిని తొలగించడానికి వెనిగర్ బాగా సహాయపడుతుంది. రెండు టేబుల్ స్పూన్ల వెనిగర్ మరియు నీళ్ళు మిక్స్ చేసి మిక్సర్ గ్రైండర్ లో పోసి రెండు సెకండ్లు అలాగే ఉంచి తర్వాత తిరిగా అదే పద్దతిని అనుసరించి తర్వాత మంచి నీటితో కడిగి శుభ్రం చేయాలి. బేకింగ్ పౌడర్ : కొద్దిగా నీళ్ళు తీసుకొని, బేకింగ్ పౌడర్ వేసి పేస్ట్ లా తయారుచేయాలి. ఈ పేస్ట్ ను మిక్సర్ గ్రైండర్ , జార్లకు పట్టించి 15నిముషాలు అలాగే పక్కన పెట్టి, ఆతర్వాత మంచి నీటితో శుభ్రం చేయాలి. డిటర్జెంట్ లిక్విడ్: ఒకటి లేదా రెండు చుక్కల డిటర్జెంట్ లిక్విడ్ ను మిక్సర్ గ్రైండర్ లో వేసి, కొద్దిగా నీటిని చిలకరించి రెండు మూడు నిముషాలు అలాగే ఉంచి తర్వాత మంచి నీటితో శుభ్రం చేయాలి. మిక్సర్ గ్రైండర్ శుభ్రం చేయడానికి ఇది కూడా ఒక ఉత్తమ మార్గం.