మీ మార్బల్ ఫ్లోరింగ్ గురించి జాగ్రత్త తీసుకోండి…
మార్బల్ ఫ్లోర్ మిళమిళ..తళతళ మెరవాలంటే... - మార్బుల్ ఫ్లోర్‌పై మరకలు పడితే బేకింగ్ సోడా, బ్లీచ్ కలిపి పేస్ట్‌లాగా తయారు చేసి మరకల్ని పూర్తిగా కవర్ చేస్తూ రాయాలి. తరువాత దానిమీద తడి వస్త్రం కప్పి రాత్రంతా అలా ఉంచేసి ఉదయాన్నే తుడిచేయాలి. మరక ఇట్టే పోతుంది. - పాలరాతి నేలల మీద ద్రవాలు కానీ ఆహార పదార్ధాలు గానీ ఒలికితే, ఉపరితలం మీద అవి చెరగని మరకలు పడిపోతాయి. అందువల్ల పొరపాటున ఏవైనా పళ్ళ రసాలు, కూల్ డ్రింక్ లు లేదా టీ పాలరాతి నేల మీద పడితే, వెంటనే హైడ్రోజన్ పెరాక్సైడ్, అమ్మోనియా కలిపిన మిశ్రమంలో ముంచిన మెత్తటి గుడ్డతో ఆ పాలరాతి నేల భాగాన్ని మళ్ళీ మెరుపు వచ్చే దాకా మెల్లిగా రుద్దండి. - నేల మీద ఉంచిన కుండలు, ఇనప ఫర్నిచర్ కాళ్ళు, నూనె, ఇంకు, మురికి నీరు లాంటివి పడితే రంగు కోల్పోతాయి. వంట నూనెలు లేదా జిడ్డు పదార్ధాలు పాలారాతి నేల మీద మరకలు పడేలా చేస్తాయి. అందువల్ల సబ్బు, నీళ్ళు పెట్టి వెంటనే అలాంటి వాటిని కడిగి వేయాలి.