పూజ సామాగ్రి కొత్తవాటిలా మిలమిలా మెరవడానికి చిట్కాలు…
1. వెండి వస్తువులను వేడినీటిలో గంటసేపు ఉంచి నిమ్మరసంతో శుభ్రపరిస్తే చాలు తెల్లగా మెరుస్తాయి. 2. ఇంట్లో తరచుగా వాడో బేకింగ్ సోడాలో నీళ్లు కలిపి పేస్టులా చేసి దాన్ని స్పాంజ్ తో తీసుకొని వెండి సామాగ్రిని రుద్దాలి. తర్వాత వేడినీటితో కడిగి పొడిగా ఉన్న మెత్తని వస్తంతో తుడిస్తే వస్తువుల మీద గీతలు మిలమిలా మెరిసిపోతాయి. 3. పూజసామాగ్రిలో చిన్న చిన్న వస్తువులు శుభ్రపరచడానికి టూత్ పేస్ట్‌ను రాసి మెత్తని బ్రిసిల్స్ ఉన్న బ్రెష్ తో రుద్దితే సరిపోతుంది. 4. దీపారాధన చేసిన వెండి దీపాలు జిడ్డుగా ఉంటాయి. ఈ జిడ్డును వదిలించాలంటే ఇబ్బంది. కాబట్టి ఈ జిడ్డు సామాగ్రిని శుభ్రం చేయడానికి బేకింగ్ సోడా పేస్ట్ ను రాసి గంటపాటు అలా ఉంచి వేడినీలితో శుభ్రపరిస్తే జిడ్డు తేలిగ్గా వదులుతుంది. 5. వెండి పూజ సామాగ్రిని పీతాంబరి పౌడర్ తో రుద్ది మంచినీటితో శుభ్రపరచి, పొడి వస్త్రంతో తుడిస్తే మిలమిల మెరుస్తుంటాయి. 6. సబీన పౌడర్ లో కొద్దిగా బేకింగ్ సోడా మిక్స్ చేసి రుద్దినట్లైతే సిల్వర్ వస్తువులు శుభ్రపడుతాయి.