బేకింగ్ సోడాతో ఇంట్లో వాసనలకు చెక్…
- ఎయిర్ కూలర్ పూర్తిగా వాటర్ తో నింపాలి, అందులో ఒక కప్పు బేకింగ్ సోడా వేసి మూత మూసి, ఒక గంట అలాగే వదిలేయాలి.ఇప్పుడు ఈ నీటిని తొలగించి, మంచి నీటితో కడిగి శుభ్రం చేయాలి. ఇలా చేసి చూడండి, మార్పు మీకే అర్ధం అవుతుంది. - ఎంత శుభ్రంగా ఉన్న టాయిలెట్స్ అయినా కొన్ని సందర్భాల్లో జిడ్డుగా లేదా పాచిగా మారుతుంది. కొద్దిగా బేకింగ్ సోడాను టాయిలెట్ బేసిన్ లో వేసి కొద్దిసేపు మూత మూసి ఒక గంట అలాగే ఉంచి తర్వాత నీరు ఫ్లష్ చేయడం వల్ల వాసన తొలగిపోతుంది. - డ్రైనేజి గొట్టాల నుండి వచ్చే ఫూయల్ స్మెల్ ను బేకింగ్ సోడాతో పూర్తిగా తొలగించుకోవచ్చు. కొన్ని వారాల పాటు, బేకింగ్ సోడాను నీళ్ళు పోయే డ్రైనేజ్ గొట్లాల్లో వేసి నింపాలి. ఒక గంట అలాగే ఉంచి తర్వాత నీరును ఫ్లష్ చేయాలి. ఇలా వారంలో రెండు మూడు సార్లు చేస్తుండాలి. -కార్పెట్ మీద మొత్తం కొద్దిగా బేకింగ్ సోడాను చిలకరించాలి. కొద్ది సమయం అలాగే ఉంచి, తర్వాత వాక్యూమ్ క్లీనర్ తో శుభ్రం చేయాలి. ఇది కార్పెట్ మీద మరియు వాక్యూమ్ క్లీనర్ రెండిటి నుండి వాసనను నిర్మూలిస్తుంది. - వంటగదిలో వాసన వచ్చే ప్రదేశంలో మరియు షింక్ మరియు కొన్ని మూలల్లో బేకింగ్ సోడాను చిలకరించి ఒక గంట తర్వాత శుభ్రం చేయాలి. బేకింగ్ సోడా అన్ని రకాల చెడు వాసనను తొలగిస్తుంది.